Rakul Preet Singh:హైదరాబాద్‌లో ఫుడ్ బిజినెస్ ప్రారంభించిన రకుల్ ప్రీత్ సింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) తాజాగా ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. హైదరాబాద్‌లో 'ఆరంభం' పేరుతో వెజ్ రెస్టారెంట్‌ను శ్రీరామ నవమి సందర్భంగా ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో రకుల్‌కి సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అందరికి పోషకాహారాన్ని అందించాలనే ఉద్దేశంలో రకుల్ ఈ 'ఆరంభం' రెస్టారెంట్‌ని స్టార్ట్ చేశానని రకుల్ తెలిపారు. ఈ రెస్టారెంట్‌లో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఐటమ్స్ లభించనున్నాయి. అలాగే ఈ రెస్టారెంట్‌లో అన్ని కూడా మిల్లెట్స్‌తో చేసిన వంటకాలు ఉండనున్నాయి. ఇందులో మిల్లెట్స్‌తో కూడిన హెల్తీ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, సూప్స్, మాల్ట్స్ ఇలా అన్ని రకాలు ఫుడ్స్ అందుబాటులో ఉండనున్నాయట.
ఇప్పటికే ఫిట్‌నెస్ రంగంలో సొంతం వ్యాపారం మొదలుపెట్టిన రకుల్‌కు హెల్త్ అండ్ స్కిన్ బిజినెస్‌లోనూ పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. ఫిట్‌నెస్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే రకుల్ సొంతంగా ఎఫ్45(F45) పేరుతో జిమ్‌తో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. హైదరాబాద్, వైజాగ్, ముంబై తదితర నగరాల్లోనూ బ్రాంచ్‌లు ఒపెన్ చేసింది. ఇక వెల్ బీయింగ్ న్యూట్రిషన్, వెల్ నెస్ న్యూట్రిషన్ బ్రాండ్స్‌లో ఆమెకు పెట్టుబడులు ఉన్నాయి.. అలాగే న్యూబ్ పేరుతో బయోడీగ్రేడబుల్, రీ యూజబుల్ డైపర్ల బిజినెస్‌ను కూడా 2019లో లాంచ్ చేసింది.
కాగా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన రకుల్ తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా అలరించింది. తెలుగులో ఆఫర్స్ తగ్గడంతో ముంబైకి మాకాం మార్చింది. బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ వస్తున్న ఆమె గత నెల తన బాయ్‌ఫ్రెండ్ జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments