అందర్నీ ఆకట్టుకునేలా ఉండే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బ్రూస్ లీ : హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, కరెంట్ తీగ, పండగ చేస్కో, లౌక్యం...ఇలా సక్సెస్ ఫుల్ మూవీస్ లో నటించి...మంచి క్రేజ్ ఏర్పరుచుకున్నహీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. రామ్ చరణ్ తో బ్రూస్ లీ, ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో..బన్నితో సరైనోడు..చిత్రాల్లో నటిస్తూ...అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది రకుల్. ఈనెల 10న రకుల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా బ్రూస్ లీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇంటర్ వ్యూ మీకోసం...
పుట్టినరోజు ఎక్కడ జరుపుకోబోతున్నారు..?
నా పుట్టినరోజును బ్రూస్ లీ ప్రమోషన్ కార్యక్రమాల్లోనే జరుపుకుంటాను.
బ్రూస్ లీ సినిమా గురించి మీరు ఏం చెబుతారు..?
బ్రూస్ లీ నా కెరీర్ లో చాలా పెద్ద సినిమా.అందర్నీ ఆకట్టుకునేలా ఉండే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బ్రూస్ లీ. ఈ సినిమా పై అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. ఖచ్చితంగా బ్రూస్ లీ అందరి అంచనాలకు తగ్గట్టుగా ఉంటుంది. మంచి విజయాన్ని సాధిస్తుంది.
బ్రూస్ లీ చిత్రంలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?
నా క్యారెక్టర్ పేరు రియా. వీడియో గేమ్ డిజైనర్ గా కనిపిస్తాను. రామ్ చరణ్ ఫైట్ మాస్టర్ గా నటిస్తున్నారు. హీరో గురించి ఓ గేమ్ డిజైన్ చేస్తాను. నా పాత్ర చాలా ఎనర్జిటిక్ గా ఉంటుంది.అలాగే గ్లామరస్ గా కూడా ఉంటుంది.నా క్యారెక్టర్ ను ఎంతో కేర్ తో డిజైన్ చేసిన శ్రీను వైట్ల గార్కి థ్యాంక్స్ చెబుతున్నాను.
మీ గత చిత్రాలతో పోలిస్తే..మీ పాత్రలో ఉన్న కొత్తదనం ఏమిటి..?
ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది. అలాగే ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది.ఈ సినిమా చేస్తున్నంత సేపు చాలా థ్రిల్ ఫీలయ్యాను. ఆడియోన్స్ కూడా సినిమా చూస్తున్నంత సేపు థ్రిల్ ఫీలవుతారు.
రామ్ చరణ్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది..?
రామ్ చరణ్ తో ఫస్ట్ టైం వర్క్ చేసాను. అతనిలో ఏ మాత్రం ఇగో లేదు. సెట్స్ లో చాలా సింపుల్ గా ఉంటాడు. చరణ్ చూసి చాలా నేర్చుకున్నాను. ఇక డాన్స్ విషయానికి వస్తే...ముందుగా ప్రాక్టీస్ చేసిన తర్వాతే చేసేవాడు. నేను కూడా అలాగే చేసాను. మీఅందరికీ మేము చేసిన డాన్సులు నచ్చుతాయి అనుకుంటున్నాను.
చిరంజీవిగారితో వర్క్ చేయడం ఎలా ఫీలయ్యారు..?
చిరంజీవి గారితో వర్క్ చేయడం జీవితంలో ఎప్పటికీ మరచిపోలేను. ఉదయం 9 గంటలకే ఆయన మేకప్ వేసుకుని సెట్స్ కి వచ్చేవారు. ఆయన వయసు 60 సంవత్సరాలు ఈ వయసులో ఇంకా ఏదో నేర్చుకోవాలనే ఆయన తపన చేస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది.
శ్రీను వైట్ల సినిమా అంటే కామెడీ ఉంటుంది..? మరి..ఈ సినిమాలో కామెడీ ఎలా ఉంటుంది..?
ఈ సినిమాలో నేను కూడా కామెడీ చేసాను. అయితే ఏదో కామెడీ ఉండాలి కదా అని పెట్టినట్టు ఉండదు. సందర్భానుసారంగా కామెడీ ఉంటుంది. అలాగే ఆడియోన్స్ కి ఏది నచ్చుతుందో శ్రీను వైట్ల గారికి బాగా తెలుసు.ఆయన నటించి చూపించి మరీ..ఆర్టిస్టుల నుంచి తనకు కావలసిన విధంగా నటనకు రాబట్టుకున్నారు. ఖచ్చితంగా బ్రూస్ లీ అందర్నీ ఎంటర్ టైన్ చేస్తుంది.
బ్రూస్ లీ లో మీ ఫేవరేట్ సాంగ్ ఏది..?
లేచలో సాంగ్ అంటే నాకు బాగా ఇష్టం.
షారుఖ్..బ్రూస్ లీ సెట్ కి వచ్చారు కదా..మీరు ఎలా ఫీలయ్యారు...?
మేము బ్రూస్ లీ సాంగ్ షూట్ లో ఉన్నాం. సడన్ గా అందరూ అక్కడి నుంచి పరిగెత్తుతూ వెళ్ళారు. ఏం జరిగింది అని కంగారు పడ్డాం. ఆ తర్వాత తెలిసింది షారుఖ్ వచ్చారని. మేము షారుఖ్ తో చాలా సేపు మాట్లాడాం. బ్రూస్ లీ సాంగ్ చూసిన తర్వాత షారుఖ్ షాంగ్ బాగుందని చెప్పడంతో యూనిట్ అంతా హ్యాపీగా ఫీలయ్యాం.
టాప్ స్టార్స్ తో సినిమాలు చేస్తున్నారు కదా..మీరే నెంబర్ వన్ హీరోయిన్ అంటే ఏమంటారు..?
నాకు ఈ నెంబరింగ్ మీద అసలు నమ్మకం లేదు. నాకు ఎవరు పోటీ..? అనే విషయం గురించి ఆలోచించను. అలా ఆలోచిస్తే వర్క్ చేయలేం. అందుచేత నెంబర్ వన్ గురించి ఆలోచించకుండా నా వర్క్ సిన్సియర్ గా చేస్తాను.
మీ ఫేవరేట్ హీరో ఎవరు..?
మహేష్, పవన్, బన్ని.
మహేష్ బ్రహ్మోత్సవంలో నటించే అవకాశం మిస్ అయ్యారు కదా..? ఏమనిపించింది..?
మహేష్ తో కలసి నటించే అవకాశం మిస్ అయినందుకు చాలా బాధపడ్డాను. అయితే..భవిష్యత్ లో ఖచ్చితంగా మహేష్ తో కలసి నటిస్తాననే నమ్మకం ఉంది.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో, బన్ని తో సరైనోడు..సినిమాలు చేస్తున్నాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com