ఈ ఏడాది రకుల్ వంతు
Send us your feedback to audioarticles@vaarta.com
కాజల్ అగర్వాల్, అమలాపాల్, శ్రుతి హాసన్.. ఇలా ముగ్గురు కథానాయికల విషయంలో చోటు చేసుకున్న ఓ అంశం ఈ ఏడాది రకుల్ ప్రీత్ సింగ్ విషయంలో పునరావృతం కానుంది. అదేమిటంటే.. మెగా ఫ్యామిలీకి చెందిన బావ - బావమరిది లైన అల్లు అర్జున్, రామ్‌చరణ్‌లతో ఒకే ఏడాదిలో ఒకే కథానాయిక ఆన్‌స్క్రీన్ చేయడం.
2009లో 'మగధీర' కోసం చరణ్‌తో ఆడిపాడిన కాజల్.. అదే ఏడాది బన్నీతో 'ఆర్య 2' కోసం రొమాన్స్ చేసింది. ఇక 2013లో 'నాయక్' కోసం చరణ్‌తో జతకట్టిన అమలా పాల్.. ఆ సంవత్సరంలోనే బన్నీతో 'ఇద్దరమ్మాయిలతో' చేసింది. ఈ వరసలోనే.. 2014లో 'ఎవడు' కోసం చెర్రీతో జోడీకట్టిన శ్రుతి హాసన్.. 'రేసు గుర్రం' కోసం బన్నీతో చిందులేసింది. ఇక ఈ ఏడాది సంగతికి వస్తే.. 'సరైనోడు' కోసం అల్లు వారి కథానాయకుడు తో తొలి సారిగా పెయిర్ కడుతున్న రకుల్.. 'తని ఒరువన్' రీమేక్ కోసం చిరు తనయుడు తో రెండోసారి వెండితెరపై దర్శనమివ్వనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments