మరో మెగా హీరో పక్కన రకుల్....

  • IndiaGlitz, [Tuesday,February 23 2016]

ప్రస్తుతం అనుష్క, సమంతల తర్వాత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడు ఈ పంజాబీ కుడి మెగా క్యాంప్ హీరోలతో వరుసగా జత కడుతూ ఉంది. రాంచరణ్ సరసన బ్రూస్ లీ చిత్రంలో నటించిన తర్వాత మరోసారి తనీ ఒరువన్ రీమేక్ ధ్రువ చిత్రంలో నటించనుంది. అలాగే స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ సరసన సరైనోడు చిత్రంలో నటిస్తుంది.

ఇప్పుడు మరో మెగా క్యాంప్ హీరోతో నటించడానికి రెడీ అవుతుంది. వివరాల్లోకెళ్తే..సాయిధరమ్ తేజ్ హీరోగా గోపించంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందని ఈ చిత్రంలో సాయిధరమ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించనుంది, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని సమాచారం.