ఆ పాత్ర కోసం మేకప్ వేసుకోలేదు - రకుల్ ప్రీత్ సింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్‌టైగర్ ఎన్టీఆర్, ఆర్య సుకుమార్ కాంబినేషన్లో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్ఎల్పి పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో..'. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలయింది. ఈ సందర్భంగా చిత్ర హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో ఇంటర్వ్యూ....
సక్సెస్ రెస్పాన్స్....
చాలా హ్యపీగా అనిపించింది. ఈ సినిమాలో నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పుకోవడం ఒక కారణమైతే. ఇంటలిజెంట్ స్క్రీన్ ప్లే మరో రీజన్. నా యాక్టింగ్, డబ్బింగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలి రోజు సినిమా స్టార్టయినా తర్వాత ఎవరూ గుర్తు పట్టలేని విధంగా వెళ్ళి ప్రేక్షకుల నడుమ సినిమా చూశాను.
నేను అలాగే చేస్తాను....
సాధారణంగా ఎమోషనల్ సీన్స్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ సీన్ కు ముందు సీన్ ఏంటి, తర్వాత సీన్ ఏంటని అడిగి తెలుసుకుంటాను. సీన్ ను పది నిమిషాలు పాటు చదివి మరో ఐదు నిమిషాల పాటు కామ్ గా ఉండి తర్వాతనే ఎమోషనల్ సీన్స్ లో నటిస్తాను.
ఎన్టీఆర్ నటన గురించి....
చాలా టాలెంటెడ్. మంచి కోస్టార్. డ్యాన్సుల విషయానికి వస్తే చూస్తే చాలు. రెడీ చేసేద్దాం అంటారు. కానీ నేను మాత్రం ప్రాక్టీస్ చేసేదాన్ని. అలాంటి హీరోతో చేస్తుంటే మనం ఇంకా ఇంప్రూవ్ అవుతాం.
అది సుకుమార్ గారి ఐడియా...
నేను డబ్బింగ్ చెప్పిన తొలి సినిమా ఇది. ముందు సుకుమార్ గారు నీ రోల్ కు నువ్వే డబ్బింగ్ చెప్పలనగానే జోక్ చేస్తున్నారనుకున్నాను కానీ డబ్బింగ్ ఆర్టిస్ట్ రెడీ చేసిన తర్వాత భయమేసింది. కానీ సుకుమార్ గారు ధైర్యం చెప్పడంతో డబ్బింగ్ చెప్పాను. డబ్బింగ్ చెప్పడం కష్టమే. నాతోడబ్బింగ్ చెప్పించడమనేది సుకుమార్ గారి ఐడియానే.
అందుకే నిన్ను ఎంపిక చేశానని అన్నారు...
నేను మ్యాథ్స్ గ్రాడ్యుయేట్ చదివాను. ఈ సినిమాలో ఓ ఫైట్ సీన్ లో చెప్పును 45 డిగ్రీల కోణంలో తిప్పాలని సుకుమార్ అనగానే నేను యాంటి డైరెక్షన్ లోనా, యాంటి డైరెక్షన్ లోనా` అని అడిగాను. అప్పుడు సుకుమార్ గారు మ్యాథ్స్ స్టూడెంట్స్ మాత్రమే దీన్ని అర్థం చేసుకోగలరు. అందుకే నిన్ను హీరోయిన్ గా సెలక్ట్ చేశానని అన్నారు.
ప్రేక్షకులను మరో స్థాయికి తీసుకెళ్ళే చిత్రం....
నా దృష్టిలో చిత్రాలను రెండు విధాలుగా తీయొచ్చు. క్రియేటివిటీ చూపడానికి చాలా కష్టపడి కొత్త చిత్రం తీస్తారు. 'గ్రావిటీ', 'ఇంటర్ స్టెల్లార్', 'ది వాక్'.. హాలీవుడ్ లో ఇలా ప్రేక్షకులను మరోస్థాయికి తీసుకువెళ్లే చిత్రాలు తీస్తారు. సుకుమార్ చేసిన ఓ డిఫరెంట్ అటెంప్ట్. ఎప్పుడూ ఒక్కటే తరహా చిత్రాలు తెస్తే, ప్రేక్షకులు కూడా అక్కడే ఉంటారు. వాళ్లను మరోస్థాయికి తీసుకువెళ్లే చిత్రాలు అవసరం. నాన్నకు ప్రేమతో అలాంటి చిత్రం.
నాకు రెండూ ఇష్టమే...
నాకు పెర్ ఫార్మెన్స్ ఉన్న పాత్రలు చేయాలని ఉంటుంది. అలాగే కమర్షియల్ సినిమాలు చేయాలని ఉంటుంది. నాకు రెండు టైప్ చిత్రాలు చేయడమిష్టమే. ఎటువంటి చిత్రంలోనైనా మంచి నటి అన్పించుకోవడమే కష్టం.
మేకప్ లేని పాత్ర....
సరైనోడులో మారుమూల గ్రామానికి చెందిన యువతి పాత్రలో కనపడతాను. తక్కువ మాట్లాడుతుంది, భావోద్వేగాలు ఎక్కువ. మేకప్ లేని పాత్ర. 'నాన్నకు ప్రేమతో..' తర్వాత మరో పూర్తి డిఫరెంట్ సినిమాలో చేయడం సంతోషంగా ఉంది.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్....
ప్రస్తుతానికి అల్లు అర్జున్ 'సరైనోడు' చేస్తున్నాను. నితిన్ తో సినిమా ఓకే చేశాను. మరో నాలుగైదు చిత్రాలు డిస్కషన్స్ లో ఉన్నాయి. వాటి వివరాలు ఇప్పుడే చెప్పలేను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com