Rakul Preet Singh: స్టెప్స్ దిగడం కాదు.. జబ్బలపై గౌన్ జారుతోంది చూస్కో, టెంప్ట్ చేస్తోన్న రకుల్

  • IndiaGlitz, [Tuesday,December 27 2022]

పుట్టి పెరిగింది ఉత్తరాదిలోనే అయినా పదహారణాల తెలుగు ఆడపిల్లగా మారిపోయారు రకుల్ ప్రీత్ సింగ్. మిగిలిన హీరోయిన్లతో పోలీస్తే చాలా వేగంగా తెలుగు భాషను నేర్చుకుని పలువురికి ఆదర్శంగా నిలిచారు. కెరటం సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఆమె.. తర్వాత వెంకటాడ్రి ఎక్స్‌ప్రెస్, నాన్నకు ప్రేమతో, బ్రూస్ లీ, ధ్రువ, స్పైడర్ వంటి సినిమాలతో అగ్ర కథానాయికగా దూసుకెళ్లారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ వరుస అవకాశాలను అందుకున్నారు. హీరోయిన్‌గా బిజీగా వుంటూనే ఫిట్‌నెస్ సెంటర్లు నెలకొల్పి వ్యాపారంలోనూ సక్సెస్ అయ్యారు రకుల్ ప్రీత్ సింగ్. హైదరాబాద్, విశాఖలలో ‘ఎఫ్ 45’ పేరుతో అత్యాధునిక జిమ్‌ను నెలకొల్పారు.

హిందీకే పరిమితమైన ఢిల్లీ సుందరి:

సౌత్‌లో కెరీర్ పీక్స్‌లో వుండగానే హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఇక్కడ అవకాశాలను వదులుకుందని విశ్లేషకులు అంటూ వుంటారు. 2018లో అయ్యారే సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్. తర్వాత ‘దేదే ప్యార్‌ దే’, ‘మర్జావన్‌’, ‘సిమ్లా మిర్చి’, ‘సర్దార్‌ కా గ్రాండ్‌ సన్‌’ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ‘అటాక్‌’, ‘రన్‌వే’, ‘థ్యాంక్‌ గాడ్‌’, ‘డాక్టర్‌ జి’ అనే సినిమాలు చేసింది.

ప్రేమ విషయం చెప్పి షాకిచ్చిన రకుల్:

మరోవైపు.. 30 ప్లస్‌లోకి వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదే అంటూ రకరకాల ఊహాగానాలు వస్తున్న సమయంలో రకుల్ ప్రీత్ సింగ్ వాటికి తెరదించారు. గతేడాది తన పుట్టినరోజు సందర్భంగా తాను ప్రేమలో వున్న విషయాన్ని బహిర్గతం చేసి అందరికీ షాకిచ్చారు రకుల్. బాలీవుడ్ యువ నిర్మాత జాకీ భగ్నానీతో రిలేషన్‌లో వున్నట్లు చెప్పింది. అప్పటి నుంచి ఈ జంట చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది కానీ పెళ్లి విషయం మాత్రం చెప్పడం లేదు.

హాట్ ఫోటోలతో సెగలు రేపుతోన్న రకుల్:

ఇదిలావుండగా... సోషల్ మీడియాలో యాక్టీవ్ వుంటారు రకుల్ ప్రీత్ సింగ్. తన సినిమాలకు సంబంధించిన విషయాలు, ఇతర వ్యక్తిగత విషయాలను ఆమె తరచుగా పంచుకుంటూ వుంటారు. అయితే ఇటీవల హాట్ హాట్ ఫోటో షూట్‌లతో రకుల్ ప్రీత్ కుర్రాళ్లకి సెగలు రేపుతున్నారు. తాజాగా వైట్ క్రీమ్ కలర్ గౌను ధరించి మెట్లపై నుంచి దిగొస్తున్న ఫోటోలను ఆమె షేర్ చేశారు. జబ్బలపై టాప్ జారిపోతున్నా లెక్క చేయకుండా అలా వదిలేసింది రకుల్. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.