ఆ సీన్ చేసేటప్పుడు నెర్వస్ గా ఫీలయ్యాను - రకుల్ ప్రీత్ సింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా రవితేజ - రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా 'కిక్' సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఎన్‌టిఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మించిన 'కిక్-2' చిత్రం ఇటీవల విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్ పాత్రికేయులతో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
'కిక్-2' చిత్రానికి రెస్పాన్స్ ఎలా ఉంది?
నా ఫ్రెండ్స్ చాలామంది మూవీచూసి చాలా బాగుంది అన్నారు. అలాగే ఆడియన్స్ నుండి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా బ్రహ్మానందం, రవితేజల కామెడీ ట్రాక్‌ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కథలో లీనమై కామెడీ వుంటుంది. స్పెషల్ ట్రాక్ అంటూ ఏం ఉండదు. డిఫరెంట్ పీపుల్స్‌కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కామెడీ నచ్చుతుంది. సో ఈ సినిమాలో స్టోరీకి తగ్గట్టుగా ట్రీట్‌మెంట్ ఉంటుంది. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్‌చేసిన ప్రేక్షకులకు థాంక్స్.
మీ క్యారెక్టర్‌కి వస్తోన్న ఫీడ్‌బ్యాక్ ఎలా వుంది?
చాలా సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉండదు. ఈ చిత్రంలో నా మనసుకి దగ్గరైన పాత్ర చేశాను. కథలో భాగంగా నా క్యారెక్టర్ ఉంటుంది. ఫస్టాఫ్‌లో సిటీ అమ్మాయిగా, సెకండాఫ్‌లో విలేజ్ గర్ల్ గా చైత్ర క్యారెక్టర్ ఉంటుంది. లుక్స్, కాస్ట్యూమ్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మంచి ఫీడ్ బ్యాక్ వస్తోంది.
ఈ చిత్రాన్ని థియేటర్‌లో చూశారా?
ఈ సినిమా రిలీజ్ అప్పుడు నేను యుకెలో ఉన్నాను. అక్కడ ఈ సినిమా చూశాను. నాకు బాగా నచ్చింది.
ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కలిగింది?
రియల్లీ గుడ్. కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ సూరి. మూడు వందల మంది ఆర్టిస్టులతో ఔట్‌డోర్‌లో షూటింగ్ చేశారు. జైసల్మీర్, హంపిలో చాలా హ్యాపీగా షూటింగ్ జరిగింది. ఆ జర్నీ చాలా మెమరబుల్‌గా ఉంది. సంధ్యమిశ్రా, రాజ్‌పాల్ యాదవ్‌లను సెట్లో చూస్తే రియల్‌గా నవ్వొస్తుంది. లొకేషన్స్‌లో అందరం బాగా ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేశాం.
రవితేజతో వర్క్ చేయడం ఎలా ఉంది?
సూపర్బ్ ఎక్స్‌పీరియన్స్. ఆన్ స్క్రీన్, స్క్రీన్ బయట చాలా ఎనర్జీగా ఉంటారు రవితేజ.
ఫస్ట్‌టైం 'కిక్-2'లాంటి బిగ్ చిత్రం చేసినట్లున్నారు?
అవునండీ. కాంబినేషన్ పరంగా, బడ్జెట్‌పరంగా 'కిక్-2' నాకు బిగ్ బడ్జెట్ చిత్రం. చాలా ఎగ్జైట్ అయ్యాను.
ఈ చిత్రంలో లిప్‌లాక్ సీన్ చేశారు కదా?
ఈ సీన్ చేసేటప్పుడు చాలా నెర్వస్‌గా ఫీలయ్యాను. కథకు అవసరం కాబట్టి ఆ సీన్‌ని వల్గారిటీ లేకుండా బ్యూటిఫుల్‌గా చిత్రీకరించారు సూరి.
ఎన్టీఆర్ ఆర్ట్స్ లో చేయడం ఎలా వుంది?
బిగ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న బ్యానర్‌లో చేయడం చాలా హ్యాపీగా ఉంది. 'కిక్-2' చిత్రాన్ని చాలా లావిష్‌గా నిర్మించారు. ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఈ సినిమా ఇంత క్వాలిటీగా వచ్చిందంటే దానికి కారణం కళ్యాణ్‌రామ్‌గారే.
కళ్యాణ్‌రామ్ సరసన ఎప్పుడు నటిస్తారు?
డెఫినెట్‌గా చేస్తాను.
మీరు చేస్తోన్న చిత్రాలు?
ఎన్టీఆర్ - సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా, రామ్‌చరణ్ - శ్రీను వైట్ల గారి సినిమా, బన్నీ - బోయపాటిల సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తున్నాను. ఇంకేం కమిట్ కాలేదు అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com