కోటు వేసుకుంటే 'బరువు' తెలిసింది.. డాక్టర్ పాత్రపై రకుల్ ఎమోషనల్
Send us your feedback to audioarticles@vaarta.com
ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా చలామణి అయిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఇక్కడ ఆఫర్లు లేవు. అయితే ఈ అమ్మడికి అదృష్టం కొంచెం ఎక్కువగా వుండటంతో బాలీవుడ్లో వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. రకుల్ ప్రస్తుతం బాలీవుడ్లో వరుసగా ప్రాజెక్ట్‌లు చేస్తోంది. మేడే, థాంక్ గాడ్ అంటూ అజయ్ దేవగణ్ సినిమాల్లో నటిస్తోంది. అటాక్ అంటూ మరో బాలీవుడ్ మూవీ, అయలాన్ అంటూ మరొ తమిళ చిత్రంలో నటిస్తోంది. ఇక ఆయుష్మాన్ ఖురానా హీరోగా రాబోతోన్న డాక్టర్ జీ చిత్రంలో రకుల్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని డాక్టర్ ఫాతిమా పాత్రకు సంబంధించిన లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
డాక్టర్ పాత్ర కావడంతో రకుల్ మెడికల్ టర్మినాలజీ గురించి, కొన్ని ముఖ్యమైన శస్త్ర చికిత్స విధానాల గురించి నేర్చుకుందట. ‘డాక్టర్ జీ సినిమా కోసం పని చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె చెప్పారు. తాను డాక్టర్ పాత్రలో కనిపిస్తున్నాను అంటే.. కచ్చితంగా ఆ మ్యానరిజం, ఆ లక్షణాలు పర్ఫెక్ట్గా ఉండాలని రకుల్ తెలిపింది. ఆ క్యారెక్టర్ సరిగ్గా పండాలంటే మెడికల్ ప్రపంచం గురించి ఎంతో కొంత అవగాహన వుండాల్సిన అవషరం వుందని చెప్పింది. డాక్టర్ ఫాతిమా పాత్రలోకి ట్రాన్సఫర్ అవ్వడం ఎంతో నచ్చిందని.. ఆ అనుభవం నాతో ఎప్పటికీ ఉంటుంది’ అని రకుల్ ఉద్వేగానికి గురైంది. అలాగే కొన్ని సీన్ల కోసం రోగులకు చికిత్స చేస్తున్నప్పుడు, డాక్టర్లు ఎంత బరువు, బాధ్యతలు కలిగి ఉంటారో, వారి జీవితం ఎంత కష్టంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని చెప్పింది రకుల్.
ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వస్తోన్న ‘‘ డాక్టర్ జీ ’’ చిత్రాన్ని అనుభూతి కశ్యప్ డైరెక్ట్ చేస్తున్నారు. సుమిత్ సక్సేనా సంభాషణలు సమకూరుస్తుండగా.. సౌరభ్ భరత్, విశాల్ వాఘ్, సుమిత్ సక్సేనా, అనుభూతి కశ్యప్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout