తమన్నా గురించి రకుల్ కామెంట్..
Send us your feedback to audioarticles@vaarta.com
మిల్కీ బ్యూటీ తమన్నా..ఓ వైపు హీరోయిన్ గా చేస్తుంది..మరో వైపు ఐటం సాంగ్స్ చేస్తుంది. అల్లుడు శీను, స్పీడున్నోడు చిత్రాల్లో తమన్నా ఐటం సాంగ్స్ చేసింది. తాజాగా జనతా గ్యారేజ్ సినిమాలో కూడా ఐటం సాంగ్ కోసం తమన్నాని సంప్రదిస్తున్నారట. బాహుబలి, ఊపిరి చిత్రాలు సక్సెస్ సాధించడంతో తమన్నా రేంజ్ మరింత పెరిగింది.
ఇదిలా ఉంటే...తమన్నా ఐటం సాంగ్స్ చేస్తుంది. మరి మీరు కూడా ఐటం సాంగ్స్ చేస్తారా..? అని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ని అడిగితే...తమన్నా మంచి డాన్సర్. అందుకనే అనుకుంట ఐటం సాంగ్స్ కూడా చేస్తుంది. నా వరకు అయితే ఐటం సాంగ్స్ చేయాలా..? వద్దా..? అనేది ఆలోచించలేదు. ఐటం సాంగ్ చేయమని ఆఫర్ వచ్చినప్పుడు ఆలోచిస్తాను. ఇప్పటి వరకు ఐటం సాంగ్స్ విషయం పై ఎలాంటి ఆలోచన లేదు అంటోంది రకుల్. తమన్నా మంచి డాన్సర్ కాబట్టి ఐటం సాంగ్స్ చేస్తుంది అంటే..తమన్నా వలే రకుల్ కి కూడా డాన్స్ బాగా వచ్చుంటే ఐటం సాంగ్ చేసేదే అన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com