ఆ ముగ్గురులో ఎవరు బెస్ట్ అనేది చెప్పడం చాలా కష్టం - హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్. ఆతర్వాత లౌక్యం, కరెంట్ తీగ, పండగ చేస్కో, కిక్ 2 బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో...తదితర చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రకుల్ తాజాగా నటించిన చిత్రం సరైనోడు. అల్లు అర్జున్ - బోయపాటి కాంబినేషన్లో రూపొందిన సరైనోడు ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సందర్భంగా సరైనోడు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో ఇంటర్ వ్యూ మీకోసం...
ఈ చిత్రంలో విలేజ్ గాళ్ గా మేకప్ లేకుండా డీ గ్లామరస్ రోల్ చేయడానికి కారణం..?
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, కిక్ 2, పండగ చేస్కో చిత్రాల్లో డీ గ్లామరస్ గానే నటించాను. బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో చిత్రాల్లో గ్లామరస్ రోల్ చేసాను. అయితే నేను మేకప్ వేసుకున్నానా లేదా..? గ్లామరస్ రోలా..? డీ గ్లామరస్ రోలా అని ఆలోచించను. నా క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉందా లేదా అనేదే చూస్తాను. ఇక సరైనోడు సినిమా విషయానికి వస్తే...మేకప్ లేకుండా విలేజ్ గాళ్ గా నటించాను. నా క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాగే పర్ ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇది. ఆడియోన్స్ కి కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను.
ఈ క్యారెక్టర్ కోసం మీరు హోమ్ వర్క్ చేసారా..?
బోయపాటి శ్రీను గారు కమర్షియల్ డైరెక్టర్. ఆయనకు ఎవరి నుంచి ఎలాంటి ఏక్టింగ్ తీసుకోవాలో బాగా తెలుసు. అలాగే హీరోయిన్స్ ని ఎలా చూపించాలో కూడా ఆయనకి బాగా తెలుసు. సింహ సినిమాలో నయనతారను ఎలా చూపించారో చూసాం కదా. అందుచేత ఈ క్యారెక్టర్ కోసం హోమ్ వర్క్ అంటూ ఏమీ చేయలేదు. ఆయన చెప్పింది ఫాలో అయిపోయాను అంతే.
ఈ సినిమాలో మీ క్యారెక్టర్ పేరు ఏమిటి..?
నా క్యారెక్టర్ పేరు మహాలక్ష్మి. కానీ..బన్ని నన్ను పేరు పెట్టి పిలవడు. పెట్ నేమ్ తో పిలుస్తుంటాడు. అది ఏమిటనేది సినిమా చూస్తే తెలుస్తుంది (నవ్వుతూ..)
కేధరిన్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..? కేథరిన్ కు - మీకు మధ్య సీన్స్ ఉన్నాయా..?
కేథరిన్ ఎమ్మెల్యే క్యారెక్టర్ చేసింది. తన క్యారెక్టర్ లో కూడా డెప్త్ ఉంటుంది. ఇక మా ఇద్దరి మధ్య సీన్స్ అంటే..ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ బాగుంటుంది.
మీరు ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నారు..?
నాకు ఒకే రకమైన క్యారెక్టర్స్ చేయాలంటే బోర్. క్యారెక్టర్ నన్ను ఎగ్జైట్ చేసేలా ఉండాలి అనుకుంటాను. చేసిన పాత్రలే మళ్లీ మళ్లీ చేస్తుంటే నాకే విసుగొచ్చేస్తుంటుంది. అందుచేత కొత్త కొత్త క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నాను.
సరైనోడు హైలైట్ ఏమిటి..?
యాక్షన్ మూవీ అంటే జనరల్ గా పెద్ద వాళ్లే చూస్తుంటారు. కానీ..పిల్లల దగ్గర్నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ చూసేలా ఉండే ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ సరైనోడు. అదే ఈ సినిమాకి హైలైట్.
బన్ని మంచి డాన్సర్ కదా..బన్నితో డాన్స్ చేసేటప్పుడు ఇబ్బంది పడ్డారా..? మీ ఇద్దరికి ఎన్ని సాంగ్స్ ఉన్నాయి..?
బన్ని చాలా మంచి డాన్సర్. అయితే సాంగ్స్ కి రిహార్సల్స్ చేసి డాన్స్ చేసేదాన్ని. అందుచేత బన్ని తో డాన్స్ చేయడానికి పెద్దగా ఇబ్బంది పడలేదు. బన్నికి నాకు ఈ సినిమాలో మూడు సాంగ్స్ ఉన్నాయి.
బన్ని- చరణ్ - ఎన్టీఆర్ ఈ ముగ్గురుతో నటించారు.. డాన్స్ చేసారు కదా..ఈ ముగ్గురులో బెస్ట్ డాన్సర్ ఎవరు..?
ముగ్గురూ మంచి డాన్సర్సే. అసలు వీళ్లు చేసే డాన్స్ చూస్తుంటే బాడీలో బోన్స్ లేవా అనిపిస్తుంటుంది. వీళ్లు ముగ్గురులో ఎవరు బెస్ట్ డాన్సర్ అని చెప్పడం చాలా కష్టం.
మీరు ఎలాంటి సినిమాల్లో నటించాలి అనుకుంటున్నారు..?
అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరి లో హీరోయిన్ గా చేయాలి అనిపిస్తుంటుంది. జబ్ వి మెట్, ఆషికి తరహా చిత్రాల్లో నటించాలి అనుకుంటున్నాను. అలాగే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఉన్నమూవీలో నటించాలని ఉంది.
ఈ మధ్య కొంత మంది సినీ తారలు ఆత్యహత్య చేసుకున్నారు కదా..ఆత్మహత్య చేసుకోవడం గురించి మీరు ఏం చెబుతారు..?
ప్రొఫెషనల్ లైఫ్ లో పడి చాలా మంది పర్సనల్ లైఫ్ మిస్ అవుతున్నారు. అలాగే మనం చేసే పనిని లవ్ చేస్తే ఎంత వర్క్ ఉన్నా టెన్షన్ అనిపించదు. అలాగే కొంత మంది వాళ్ల కోసం కాకుండా పక్క వాళ్ల కోసం..అనవసర విషయాలు గురించి ఆలోచించడం వలన ఇలా జరుగుతుంది అనుకుంటున్నాను. నెంబర్ వన్ హీరోయిన్ ఆమె ఎందుకు అయ్యింది..? మనం ఎందుకు నెంబర్ వన్ అవ్వడం లేదు..? ఇలా నెంబర్ గేమ్ గురించి కొంత మంది ఆలోచిస్తుంటారు. పక్క వాళ్ల గురించి కాకుండా మన గురించి ఆలోచిస్తూ 100% ఎఫర్ట్ పెట్టి సిన్సియర్ గా వర్క్ చేస్తే మనం ఏది కావాలనుకున్నామో అదే మన దగ్గరకి వస్తుంది. వర్క్ టెన్సన్ పెరిగినప్పుడు టెన్షన్ పోవడానికి ఫ్రెండ్స్ తో మాట్లాడడం..రిలాక్స్ అవ్వడం చేయాలి. టెన్షన్ ని ఎలా తగ్గించుకోవాలో తెలియకపోవడం వలన ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనుకుంటున్నాను.
మెగా హీరోలతో వరుసగా సినిమాలు చేస్తున్నారు..? కారణం ఏమిటి..?
మెగా హీరోలతో వరుసగా సినిమాలు చేసే అవకాశం వచ్చింది చేస్తున్నాను అంతే. కానీ దీనికి ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదు.
మీకు హైదరాబాద్ లో ఇల్లు ఎవరో కొని ఇచ్చారట..? నిజమేనా..?
హైదరాబాద్ లో నాకు ఎవరో ఇల్లు కొని ఇచ్చారని ఎవరో రాస్తే మా బ్రదర్ చదవి నాతో చెప్పాడు. అలాంటిదేమి లేదండీ. నేను పైసా పైసా కష్టపడి సంపాదించిన డబ్బుతో హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కున్నాను. అంతే కానీ ఎవరో రాసినట్టు నాకు ఎవరూ కొని ఇవ్వలేదు. అసలు ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తాయో అర్ధం కాదు. ఈ ఇల్లు కొనడం కోసం లోన్ తీసుకున్నాను. ఆ లోన్ విషయం నాన్నకు తెలుసు కాబట్టి సరిపోయింది. లేకపోతే...ఏమిటి పరిస్థితి. ఇల్లు, కారు అనేది ఖచ్చితంగా కావాలి కదా..అందుకనే నేను ప్లాన్ చేసి కష్టపడిన డబ్బులుతో కారు - ఇల్లు కొనుక్కున్నాను. బిజినెస్ కూడా పెట్టాను.
జిమ్ బిజినెస్ ఎలా ఉంది..?
బిజినెస్ బాగుంది. మా జిమ్ లో కేవలం జిమ్ మాత్రమే కాకుండా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి..? అనేది ప్రత్యేకంగా తెలియచేస్తున్నాం. అది మా జిమ్ స్పెషాలిటి. మా జిమ్ కి మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు హ్యాఫీగా ఉంది.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
రామ్ చరణ్ సరసన తని ఓరువన్ రీమేక్ లో నటిస్తున్నాను. ఈ సినిమా షూటింగ్లో ఈ నెలాఖరు నుంచి పాల్గొంటాను. అలాగే సాయిథరమ్ తేజ్ హీరోగా మలినేని గోపీచంద్ దర్శకత్వంలో రూపొందే సినిమాలో నటిస్తున్నాను. ఈ సినిమా మేలో ప్రారంభం అవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout