రకుల్ కూడా బిజినెస్ పెట్టేసింది....

  • IndiaGlitz, [Tuesday,February 16 2016]

ప్ర‌స్తుతం సినిమా రంగంలోని న‌టీన‌టులంద‌రూ త‌మ ఆదాయాన్ని హోటల్స్‌, ఫ్యాష‌న్ డిజైనింగ్ రంగాల్లో ఇన్‌వెస్ట్ చేస్తున్నారు. మ‌రికొంద‌రైతే రియ‌ల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబ‌డిగా పెడుతున్నారు. అయితే వీరంద‌రికి భిన్నంగా పంజాబి పాల‌కోవా ర‌కుల్ ప్రీత్ సింగ్ ఫిట్‌నెస్ పై ఇన్‌వెస్ట్ చేయ‌డానికి రెడీ అయింది. హైద‌రాబాద్ గ‌చ్చిబౌలిలో ఎఫ్ 45 లాంజ్ అనే ఫిట్‌నెస్ కేర్‌ను స్టార్ట్ చేసింద‌ట‌. తాను సినిమాల్లోకి రాకుంటే త‌ప్పకుండా ఫిట్‌నెస్ ట్రైన‌ర్ అయ్యుండేదాన్ని అనే ర‌కుల్ ఇప్పుడు నిజంగా త‌న ఆదాయాన్ని తన‌కు న‌చ్చిన రంగంలో ఇన్‌వెస్ట్ చేస్తుండ‌టం త‌న‌కు ఆనందాన్నిచ్చే విష‌య‌మేన‌ని చెప్పవ‌చ్చు.