నేను లక్కీ అనడానికి ఇదే నిదర్శనం...కానీ...అది మాత్రం అడగద్దు - రకుల్ ప్రీత్ సింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
కథానాయికగా ప్రవేశించిన అనతి కాలంలోనే అగ్రహీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ అనిపించుకున్న అందాల నాయిక రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ధృవ చిత్రంలో నటించింది. స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ధృవ చిత్రం ప్రేక్షకాదరణతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. యు.ఎస్ లో 1 మిలియన్ మార్క్ ను అందుకున్న రామ్ చరణ్ తొలి చిత్రంగా ధృవ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సక్సెస్ ఫుల్ మూవీ గురించి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో స్పెషల్ ఇంటర్ వ్యూ మీకోసం..!
రామ్ చరణ్ & సురేందర్ రెడ్డితో మీకు రెండో సినిమా కదా..! సెకండ్ టైమ్ వర్క్ చేసినప్పుడు కంఫర్ట్ లెవెల్ ఎలా ఉంటుంది..?
ఒక హీరోతో కానీ, డైరెక్టర్ తో కానీ సెకండ్ టైమ్ వర్క్ చేస్తున్నాం అంటే కంఫర్ట్ లెవెల్ బాగుంటుంది. పర్ ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. దీంతో ప్రాజెక్ట్ బాగా వస్తుంది.
బ్రూస్ లీ, కిక్ 2 సినిమాలు ఆడకపోయినా చరణ్, సురేందర్ రెడ్డి ధృవలో అవకాశం ఇవ్వడం గురించి మీరేమంటారు..?
ఎయిత్ వండర్ లా అనిపిస్తుంది (నవ్వుతూ...) షారుఖ్ - కాజల్ సక్సెస్ ఫుల్ పెయిర్. అయినా వాళ్లిద్దరూ కలిసి నటించిన కొన్ని సినిమాలు ఆడలేదు. సినిమా సక్సెస్ అవ్వడం ఫెయిల్ అవ్వడం అనేది నా చేతుల్లో ఉండదు. మీరన్నట్టు బ్రూస్ లీ, కిక్ 2 సినిమాలు సక్సెస్ కాకపోయినా నాకు వాళ్లు అవకాశం ఇచ్చారంటే..అది నా ఎఛీవ్ మెంట్ లా ఫీలవుతున్నాను.
తని ఓరువన్ లో నయనతార చేసిన క్యారెక్టర్ మీరు చేయాలి అన్నప్పుడు మీకేమనిపించింది..?
తెలుగు, తమిళ్ మూవీస్ చూస్తుంటాను. తమిళ్ లో సక్సెస్ అయిన తని ఓరువన్ మూవీ చూసాను. నాకు చాలా బాగా నచ్చింది. ఈ మూవీని తెలుగులో ఎవరైనా రీమేక్ చేస్తారా అనుకున్నాను. తని ఓరువన్ చూసిన రెండు నెలలకు ఈ మూవీ ఆఫర్ వచ్చింది. సినిమా నాకు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసాను.
నయనతారతో కంపేర్ చేస్తే ధృవలో క్యారెక్టర్ బాగా చేసాను అనుకుంటున్నారా..?
అది నేను కాదు..మీరు చెప్పాలి (నవ్వుతూ...)
తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ అనిపించుకున్నారు కదా...ఏమనిపిస్తుంది..?
నేను సక్సెస్ తో పాటు ఫెయిల్యూర్స్ కూడా చూసాను. నా క్యారెక్టర్ కు 100% న్యాయం చేయాలి అనుకుంటాను. రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఆలోచించను. ఏది ఏమైనా మీరన్నట్టు తక్కువ టైమ్ లో స్టార్ హీరోయిన్ అనిపించుకోవడం హ్యాపీగా ఉంది.
వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు కదా..! టెన్షన్ ఏమైనా ఫీలవుతుంటారా..?
సినిమాలు చేయాలని నేనే సైన్ చేసాను కదా..! ఎక్కువ సినిమాలు చెయి అని నాపై ఎవరు ఒత్తిడి చేయలేదు. నేనే చేస్తానని ఒప్పుకున్నాను. అందుచేత షూటింగ్ లో బిజీగా అని ఎలాంటి టెన్షన్ లేదు. అయినా నాకు పని చేయడం అంటేనే ఇష్టం. షూటింగ్ కి వెళ్లడాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంటాను.
మీ బ్రదర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇవ్వనున్నారని వార్తలు వస్తున్నాయి నిజమేనా..?
అవును. మా బ్రదర్ ఆర్టిస్ట్ అవ్వాలి అనుకుంటున్నాడు. ప్రస్తుతం తెలుగు నేర్చుకుంటున్నాడు. త్వరలోనే ఆర్టిస్ట్ అవుతాడు అని ఆశిస్తున్నాను. ఏం జరుగుతుందో చూడాలి. ఈ సందర్భంగా మా బ్రదర్ కి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను.
మీరు ఇప్పటి వరకు వర్క్ చేసిన హీరోల గురించి ఒక్కమాటలో చెప్పమంటే ఏం చెబుతారు..?
మహేష్ - హార్డ్ వర్కర్, రవితేజ - రెడ్ బుల్ ఎనర్జీ, చరణ్ - నైస్ పర్సన్, బన్ని - రియల్ ఆర్టిస్ట్, చైతన్య - లవ్ లీ & సైలెంట్ పర్సన్, ఎన్టీఆర్ - ఏక్టింగ్, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్, లాంగ్వేజ్...ఇలా అన్నిరకాల టాలెంట్స్ ఉన్న పర్సన్.
మహేష్ తో బ్రహ్మోత్సవం సినిమాలో నటించాలి కానీ మిస్ అయ్యారు. ఆ సినిమా రిజల్ట్ ఏమిటో అందరికీ తెలిసిందే. రకుల్ లక్కీ అనడానికి ఇదే నిదర్శనం అంటే మీరేమంటారు..?
బ్రహ్మోత్సవం ఒకటే కాదు...నేను చేయాలి అనుకుని చేయలేని సినిమాలు ఫ్లాప్ అయినవి ఇంకొన్ని ఉన్నాయి. అయితే...అవి ఏ సినిమాలు అని మాత్రం అడగకండి (నవ్వుతూ..)
చైతన్య సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?
నా క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది తర్వాత చెబుతాను. ఒకటి మాత్రం చెప్పగలను ఈ సినిమా నా కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండే సినిమా అవుతుంది. కెరీర్ లో మరచిపోలేని సినిమా లు అప్పడప్పుడు వస్తుంటాయి అంటాం కదా...నిజంగా అలాంటి సినిమా. అందుకనే ఈ కథ వినగానే డేట్స్ కుదరకపోయినా ఎలాగైనా సరే...వేరే సినిమాల డేట్స్ ఎడ్జెస్ట్ చేసైనా సరే ఈ మూవీ చేయాలి అనుకున్నాను. అంతలా నచ్చింది.
మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమిటి..?
రాజమౌళి గారి డైరెక్షన్ లో వర్క్ చేయాలి. అదే నా డ్రీమ్ ప్రాజెక్ట్.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
మహేష్, మురుగుదాస్ మూవీ, తేజు విన్నర్, చైతన్య - కళ్యాణ్ కృష్ణ మూవీ, బెల్లంకొండ సాయిశ్రీనివాస్, బోయపాటి శ్రీను మూవీ, తమిళ్ మూవీ చేస్తున్నాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments