రకుల్ .. షాకింగ్ రెమ్యునరేషన్!!
Send us your feedback to audioarticles@vaarta.com
'స్పైడర్' తర్వాత తెలుగులో మరే సినిమా చేయని రకుల్ ప్రీత్ సింగ్ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బయోపిక్ `యన్.టి.ఆర్`లో అలనాటి శ్రీదేవి పాత్రలో నటిస్తుంది. అయితే ఈ పాత్రలో నటించడానికి రకుల్ కోటి రూపాయలు రెమ్యునరేషన్ అడిగిందని ఫిలింనగర్లో వార్తలు వినపడుతున్నాయి.
బయోపిక్‌లో రకుల్ ప్రాత 20 నిమిషాలు మాత్రమే ఉంటుందట. రీసెంట్గా ఎన్టీఆర్ వేటగాడు సినిమాలో `ఆకు చాటు పిందే తడిసే.. ` సాంగ్‌ను పిక్చరైజ్ చేశారు. అలాగే మరికొన్ని హిట్ చిత్రాల్లోని సాంగ్స్‌ను చిత్రీకరిస్తారట. ఇరవై నిమిషాల పాత్ర కోసం అంత రెమ్యునరేషన్ అవసరమా? అంటే.. నిర్మాతలు మేకింగ్ విషయంలో కాంప్రమైజ్ కావడం లేదని తెలుస్తుంది.
నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రధారిగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రమిది. కథానాయకుడు, మహానాయకుడు అనే రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ చిత్రంలో ఇంకా విద్యాబాలన్, రానా, మంజిమమోహన్, సచిన్ ఖేడేకర్, జిస్సేన్ గుప్తా తదితరులు నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Iniya Vaishnavi
Contact at support@indiaglitz.com