తొలిసారి తెరపై కనిపించబోయే శ్రీదేవి... రకుల్
Send us your feedback to audioarticles@vaarta.com
`యన్.టి.ఆర్` బయోపిక్ తొలి భాగం కథానాయకుడులో శ్రీదేవి పాత్రలో కనిపించనున్నారు రకుల్ ప్రీత్‌సింగ్. దీని కోసం ఆమె సిన్సియర్‌గా కసరత్తులు చేస్తున్నారు. ఈ సినిమా గురించి రకుల్ ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడారు. ఆ
విశేషాలు..
శ్రీదేవిగా నటించడం ఎలా ఉంది?
చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. ఆమె లెజండరీ నటి. ఆమెలాగా తెరపై కనిపించడం అంటే మామూలు విషయం కాదు. ఎన్నో కళ్లు ఈ పాత్ర కోసం ఎదురుచూస్తుంటాయి.
ఈ పాత్ర మీ దగ్గరకు రాగానే ఏమనిపించింది?
చాలా హ్యాపీగా ఫీలయ్యాను. చిన్నప్పటి నుంచి ఆమె సినిమాలు చూస్తూ పెరిగాం. ఆమెకున్న చరిష్మా ఎలాంటిదో తెలుసు. ఈ సినిమాలోనూ ఆమెకు సంబంధించిన సన్నివేశాలను నాకు డైరక్టర్ వివరించారు. కథ చాలా బాగా రాసుకున్నారు. డైరక్టర్ చెప్పగానే నేను హోమ్ వర్క్ చేయాలని నిర్ణయించుకున్నా.
ఎలాంటి హోమ్ వర్క్ చేయబోతున్నారు?
ఇప్పటికే ఆమె నటించిన చాలా సినిమాలు చూశాను. ఇకపై కూడా చూస్తాను. ఈ సారి ఆమె వ్యావహారిక శైలిని గమనిస్తాను. ఎలాంటి ఎక్స్ ప్రెషన్స్ ఇస్తారో చూస్తాను. ఫిజికల్‌గానూ మరింత వర్కవుట్స్ చేస్తాను.
శ్రీదేవి కుటుంబసభ్యులను కలిసే వీలుందా?
తప్పకుండా కలుస్తాను. ఆమె కుటుంబసభ్యులతో పాటు ఆమె సన్నిహితులను కూడా కలుస్తాను. ఈ ప్రాజెక్ట్ పరంగా చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టను. నా వంతు కృషి నేను చేస్తాను.
సినిమాకు సంబంధించి పర్టిక్యులర్‌గా శ్రీదేవి నటించిన సినిమాలు చూడమని క్రూ ఏమైనా హింట్ ఇచ్చారా?
కొన్ని సినిమాలు చూడమన్నారు. అవేంటన్నది ఇప్పుడు చెప్పను. కానీ డెఫనెట్‌గా స్క్రీన్ మీద ఫీస్ట్ అవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com