రకుల్ గడుసుతనం
Sunday, July 9, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమా ఇండస్ట్రీలో హీరోల కెరీర్ ఎక్కువ సంవత్సరాలు వుంటుంది. హీరోయిన్ల కెరీర్ మాత్రం చాలా తక్కువ కాలం వుంటుంది. 10 సంవత్సరాలకు మించి హీరోయిన్లుగా చలామణి అయిన వారిని వేళ్ళపై లెక్కించవచ్చు. దానికి కారణం గ్లామర్. హీరోయిన్ గ్లామర్‌గా వున్నంత కాలమే ప్రేక్షకుల ఆదరణకు నోచుకోగలుగుతుంది. గ్లామర్ తగ్గినా, ఆమెకు పెళ్ళయినా హీరోయిన్గా నిలదొక్కుకోవడం కష్టమే. ఈమధ్యకాలంలో ఐదారు ఏళ్ళు హీరోయిన్గా చేయడమే అరుదుగా మారింది. ప్రస్తుతం వున్న హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం తాను ఒక్కో మెట్టూ ఎక్కుతూ వచ్చానని ఈ పంజాబీ బ్యూటీ చెబుతోంది.
టాలీవుడ్లో బిజీ హీరోయిన్ అయిపోయిన రకుల్ నీరజ్ పాండే దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతోంది. తనకు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడం వల్ల అవకాశాలు వెతుక్కుంటూ రాలేదని, వచ్చిన అవకాశాన్ని మాత్రం వదలకుండా సద్వినియోగం చేసుకుంటూ వచ్చానని చెప్తోంది రకుల్. ఇప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఎదగడం వెనుక ఎన్నో కష్టాలు వున్నాయంటోంది. ఇక్కడ టాలెంట్ వున్న వారిని ఎంతో గౌరవిస్తారు. ప్రతి ఇండస్ట్రీలోనూ మంచి, చెడు కలిసి వుంటాయి. అలాగే ఇక్కడ కూడా మంచి వాళ్ళు వున్నారు, చెడ్డవాళ్ళూ వున్నారు. మన వృత్తిని మనం ఎంత గౌరవిస్తున్నాం. మనల్ని ఎలా పరిచయం చేసుకుంటున్నామన్నది ముఖ్యం. ఇక్కడ ఎవరు ఎలాంటి వారు అనేది తెలుసుకోవడం ఇంకా ముఖ్యమని గడుసుగా అంటోంది రకుల్ ప్రీత్ సింగ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments