చరణ్, బోయపాటి చిత్రంలో రకుల్?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాని డి.వి.వి.ఎంటర్టైన్మెంట్ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతం కోసం అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ నర్తించబోతోందని సమాచారం. ఇప్పటికే చిత్ర యూనిట్ రకుల్‌ను సంప్రదించిందని.. ఇదివరకు రామ్ చరణ్‌తో రెండు సినిమాలు, బోయపాటితో రెండు సినిమాలు చేసిన అనుబంధంతో రకుల్ కూడా ఈ స్పెషల్ సాంగ్‌కు ఓకే చెప్పిందని సమాచారం. త్వరలోనే రకుల్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments