డీ గ్లామ‌ర్ పాత్ర‌లో ర‌కుల్‌..?

  • IndiaGlitz, [Friday,August 21 2020]

తెలుగు, త‌మిళ చిత్రాల‌తో పాటు అడ‌పా ద‌డ‌పా హిందీ చిత్రాల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్‌. ఈ అమ్మ‌డు తాజాగా క్రిష్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్న చిత్రంలో వైష్ణ‌వ్ తేజ్‌తో క‌లిసి న‌టిస్తోంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. ఈ చిత్రం జంగిల్‌బుక్ త‌ర‌హాలో ఉండ‌బోతుంద‌ట‌. జంతువులు కూడా ఈ సినిమా ప్ర‌ధాన భూమిక పోషిస్తాయ‌ని అంటున్నారు. సింగిల్ షెడ్యూల్‌లో 40 రోజుల పాటు వికారాబాద్ అడవుల్లో చిత్రీక‌ర‌ణ జ‌ర‌ప‌నున్నారు. అక్టోబ‌ర్‌కంతా సినిమా షూటింగ్‌ను పూర్తి చేసేలా ప్ర‌ణాళిక‌లు వేసుకున్నారు క్రిష్‌.

తాజా స‌మాచారం మేర‌కు ర‌కుల్ ఈ సినిమాలో డీ గ్లామ‌ర్ పాత్ర‌ను పోషిస్తుంద‌ట‌. వివ‌రాల మేర‌కు ఈ చిత్రంలో ర‌కుల్ రైతు కూలీగా క‌నిపిస్తుంద‌ని స‌మాచారం. ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళ చిత్రాల‌తో పాటు హిందీ చిత్రాల్లోనూ హీరోయిన్‌గా మెప్పించి గుర్తింపు సంపాదించుకుంది ర‌కుల్ ప్రీత్ సింగ్‌. అయితే ఈ స్టార్ హీరోయిన్‌కు ఇప్పు పెద్ద‌గా అవ‌కాశాలు లేవు కానీ.. ఆమె త‌న వ్యాప‌కాల‌తో బిజీ బిజీగానే ఉంటోంది. ప్ర‌స్తుతం త‌మిళంలో శివ‌కార్తికేయ‌న్‌, ‘ఇండియ‌న్ 2’ సినిమాల‌తో పాటు తెలుగులో నితిన్‌, చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి మూవీలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. అలాగే ‘దే దే ప్యార్ దే’ సినిమాలో త‌న న‌ట‌న‌తో మెప్పించ‌డంతో అజ‌య్ దేవ‌గ‌ణ్ ఈ అమ్మ‌డుని ప్ర‌త్యేకంగా సిఫార్స్ చేసి ‘థాంక్ గాడ్’ సినిమాలో న‌టించే అవ‌కాశం ఇప్పించార‌ట‌.

More News

రావ‌ణుడి పాత్ర‌కు ఆ స్టార్ ఓకే అంటాడా?

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ఇప్పుడు ప్యాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగారు. ఇప్పుడు ప్ర‌భాస్ చేస్తున్న మూడు సినిమాలు ప్యాన్ ఇండియా సినిమాలే కావ‌డం విశేషం.

ఎస్పీ బాలు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఎంజీఎం

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యంగా తిరిగి రావాలని దేశం మొత్తం కాక్షింస్తోంది. కరోనాతో పోరాడుతున్న ఆయన ఆరోగ్యంలో మార్పేమీ లేదని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.

ఆగ‌స్ట్ 26 నుంచి కెజిఎఫ్‌2 బ్యాలెన్స్‌ షూటింగ్ ప్రారంభం

రాకింగ్ స్టార్ య‌ష్ హీరోగా.. కైకాల స‌త్య‌నారాయ‌ణ స‌మ‌ర్ప‌ణ‌లో హోంబ‌లే ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో

ఏపీలో కొత్తగా 9544 కరోనా కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ మరణాలు సైతం వందకు చేరువలో నమోదవుతూ ప్రజానీకాన్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి.

బియర్ గ్రిల్స్‌.. ఇప్పుడు అక్ష‌య్ వంతు

డిస్క‌వ‌రీ ఛానెల్‌ను చాలా మంది ప్రేక్ష‌కులు ఇష్ట‌ప‌డి చూస్తుంటారు.