కోవిడ్ 19 ప్రభావం.. మురికివాడలో పేదలకు రకుల్ సాయం
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా వైరస్(కోవిడ్ 19) ప్రభావంతో దేశమంతా లాక్ డౌన్ అయ్యింది. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది. అప్పటి వరకు రోజువారీ కూలీలు, కార్మికులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయి. చాలా మంది పేదలకు తిండి దొరకడం కష్టమవుతుంది. ఈ సందర్భంలో పలువురు సినీ తారలు పేద ప్రజలకు తమ వంతు సాయాన్ని అందిస్తున్నారుజ. తాజాగా ఈ లిస్టులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా చేరింది.
ప్రస్తుతం గుర్గావ్లోని తన ఇంట్లో ఉంటున్న రకుల్ ప్రీత్ సింగ్ తన ఇంటి దగ్గర ఉన్న మురికివాడలోని 250 మంది పేదవాళ్లకు రెండు పూటల తిండిని అందిస్తున్నారట. ఈ విషయాన్ని రకులే చెప్పారు. తండ్రి సాయంతో పక్కనున్న పేదవారి గురించి వివరాలను సేకరించిన రకుల్ తన ఇంటి దగ్గరలోనే తిండిని వండించి అందిస్తుందట. లాక్ డౌన్ పరిస్థితి కొనసాగే వరకు ఈ పేదవారికి రెండు పూటల తిండిని అందిస్తామని, ఒకవేళ లాక్ డౌన్ కొనసాగితే కూడా వారికి తిండిని అందిస్తామని రకుల్ తెలిపారు. ప్రస్తుతం తెలుగులో సినిమాలేవీ చేయని రకుల్ హిందీలో అజయ్ దేవగణ్తో ఓ సినిమాను.. తెలుగులో నితిన్, చంద్ర శేఖర్ ఏలేటి సినిమాలోనూ నటించనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com