చెన్నై కోసం 'నేను సైతం' అంటున్న రకుల్ ప్రీత్ సింగ్

  • IndiaGlitz, [Friday,December 04 2015]

అధిక వర్షాల కారణంగా నానా ఇబ్బందులకు గురవుతున్న చెన్నై వాసులకు మన తెలుగు కథానాయకులు ఆసరాగా నిలుస్తున్న విషయం తెలిసిందే. కొంతమంది ఆర్ధికంగా ఆదుకొంటుండగా.. మరికొంతమంది వారికి అత్యవసరమైన నీళ్లు, బిస్కెట్ ప్యాకెట్లు వంటి ఆహార పదార్ధాలు చెన్నైకి పంపిస్తూ తమకు కుదిరినంతలో సహాయం చేస్తున్నారు.

ఇప్పుడు ఈ జాబితాలో కథానాయకి రకుల్ ప్రీత్ సింగ్ కూడా చేరుతోంది. తనవంతు సాయంగా 5000 మందికి సరిపడా ఆహారపదార్ధాలతోపాటు మంచినీటిని అందిస్తోంది.

కథానాయికగా తనను ఆదరించిన ప్రేక్షకదేవుళ్ళకు ఈ విధంగా సహాయం అందించే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు రకుల్ తెలిపింది.

More News

వైజాగ్ లో చైతు, శ్రుతి..

యువ సమ్రాట్ నాగ చైతన్య హీరోగా కార్తీకేయ ఫేం చందు మొండేటి దర్శకత్వంలో ప్రేమమ్ రీమేక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

కోనకి కోపం వచ్చింది..

స్టార్ రైటర్ కోన వెంకట్ కథ, కథనం అందించడంతో పాటు చిత్ర సమర్పకుడిగా వ్యవహరించిన తాజా చిత్రం శంకరాభరణం. ఈ మూవీలో నిఖిల్, నందిత జంటగా నటించారు. ఎన్నో అంచనాలతో శంకరాభరణం ఈరోజు రిలీజైంది.

సునీల్ మూవీ టైటిల్...

కమెడియన్ నుండి హీరోగా మారిన సునీల్ సినిమా విడుదలైన చాలా కాలమైంది.ప్రస్తుతం కృష్ణాష్టమి విడుదలకు సిద్ధమవుతుంది.

శంకరాభరణం మూవీ రివ్యూ

ఈ మధ్య తెలుగు సినిమా అంతా ఎన్నారైల చుట్టూనే తిరుగుతుంది. తను కూడా తిరిగితే తప్పేంటి అనుకున్నాడేమో కానీ స్టార్ రైటర్ పట్టంతో ఉన్న కోనవెంకట్ ఇప్పుడు అలాంటి కథను రాసుకున్నాడు. అత్తారింటికి దారేది, పండగచేస్కో సినిమాల తరహాలో ఈ సినిమా అంతా ఎన్నారైల చుట్టూనే నడిపాడు.

చెన్నై వరద బాధితులకు రూ.15 లక్షల విరాళం ప్రకటించిన కృష్ణంరాజు, ప్రభాస్

ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు రూ.5లక్షలు ప్రకటించిన ప్రభాస్.భారీ వర్షాల కారణంగా తమిళనాడులోని 9జిల్లాలు వరద తాకిడికి గురైన విషయం తెలిసిందే.