రకుల్ రేంజ్ పెరుగుతోంది
Send us your feedback to audioarticles@vaarta.com
మూడేళ్ల క్రితం వరకు రకుల్ ప్రీత్ సింగ్ ఓ సాదాసీదా హీరోయిన్. అయితే ఆమె దశని, దిశని.. సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే తేది మార్చేసింది. 2014, సెప్టెంబర్ 26న విడుదలైన లౌక్యంతో రకుల్ జాతకమే మారిపోయింది. ఈ సినిమాతో రకుల్ లో ఓ స్టార్ మెటీరియల్ ఉందన్న విషయం సినీ జనాలకు తెలిసొచ్చింది. కట్ చేస్తే.. రవితేజ, రామ్‌చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లతో వరుసగా సినిమాలు అందాయి. ఇప్పుడు మహేష్‌బాబుతో చేసిన స్పైడర్ విడుదలకి సిద్ధమైంది.
ఇదిలా ఉంటే.. స్టార్ హీరోల సినిమాలకి భారీగానే పారితోషికం పుచ్చుకునే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన రెమ్యూనరేషన్‌ని పెంచిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా రూ.2.5 కోట్లని రకుల్ డిమాండ్ చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కోలీవుడ్‌లో స్పైడర్ ప్రమోషన్స్‌కి వచ్చినప్పుడు రకుల్ ని తమ కొత్త చిత్రాల కోసం కొందరు నిర్మాతలు సంప్రదించారని.. ఆమె అడిగినంత ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారని తమిళనాట గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే దక్షిణాదిన అధిక పారితోషికం తీసుకున్న కథానాయికల జాబితాలో నయన తార, అనుష్క తరువాత రకుల్ పేరుని చేర్చుకోవచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments