ఐయామ్‌ బ్యాక్‌..రకుల్‌ ఆన్‌ సెట్స్‌ సందడి

  • IndiaGlitz, [Monday,January 04 2021]

తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించి హీరోయిన్‌గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఈ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ కోవిడ్‌ సమయంలో ఇచ్చిన నిబంధనలను పాటిస్తూ క్రిష్‌ దర్శకత్వంలో రూపొందిన షూటింగ్‌లో పాల్గొని సినిమాను పూర్తి చేసేసింది. అయితే ఏం చేద్దాం. ఎక్కడో పొరపాటు జరగడంతో రకుల్‌కు ఇటీవల కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో రకుల్ హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంది. రీసెంట్‌గా కరోనా టెస్టులో కరోనా నెగటివ్‌ వచ్చింది. దీని తర్వాత ఖాళీగా కూర్చోవాలని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అనుకోలేదు. వెంటనే షూటింగ్స్‌కు రెడీ అంటూ దర్శక నిర్మాతలకు సంకేతాలిచ్చేసింది.

అందులో భాగంగా అజయ్‌ దేవగణ్‌ దర్శక నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం 'మే డే'. ఈ సినిమా షూటింగ్‌లో రకుల్‌ పాల్గొంది. దానికి సంబంధించిన చిన్న వీడియోను తన ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ నేను పనిచేస్తుంటూనే సంతోషంగా ఉంటాను అంటూ కామెంట్‌ కూడా పెట్టింది. మే డే సినిమాలో బాలీవుడ్ సూపర్‌స్టార్‌.. బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ ఏడాది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. తెలుగులో నితిన్‌ చెక్‌ విడుదలవుతుంది. తమిళంలో కార్తి, శివ కార్తికేయన్‌ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. హిందీలో మేడే సినిమా జరుపుకుంటోంది. మరి ఈ ఏడాది సక్సెస్‌లతో మరింత బిజి బిజీగా మారుతుందేమో చూడాలి.

More News

క్రేజీ రోల్‌లో దీపికా పదుకొనె..!

బాలీవుడ్‌ స్టార్స్‌కు పాత్ర నచ్చితే చాలు.. హీరోగానే నటించాలని చూడరు. ప్రతినాయకుడిగానైనా తెరపై సందడి చేయడానికి రెడీ అయిపోతుంటారు.

కోవాగ్జిన్‌కు డీసీజీఐ లైసెన్సింగ్ అనుమతి..

హైదరాబాద్‌కు చెందిన దిగ్గజ ఔషధ సంస్థ భారత్ బయోటెక్‌కు ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) లైసెన్సింగ్ అనుమతిని మంజూరు చేసింది.

మాదకద్రవ్యాల కేసులో టాలీవుడ్ నటి అరెస్ట్..

మాదక ద్రవ్యాల కేసు.. టాలీవుడ్‌ను ఓ కుదుపు కుదిపేసి.. తరువాత బాలీవుడ్‌లోనూ ప్రకంపనలు సృష్టించి చివరకు తిరిగి టాలీవుడ్‌ మెడకూ చుట్టుకుని ఇటీవలి కాలంలో సైలెంట్ అయిపోయింది.

'చెక్' ఫస్ట్  గ్లింప్స్ రిలీజ్!!

నితిన్ - చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్లో భవ్య క్రియేషన్స్ పతాకం పై  వి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం "చెక్".

జనవరిలో సందడే సందడి.. 5 సినిమాల రిలీజ్ డేట్ అనౌన్స్..

లాక్‌డౌన్ కారణంగా మూత పడిన థియేటర్లన్నీ దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి.