డ్రగ్స్ కేసు విషయమై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన రకుల్..

  • IndiaGlitz, [Thursday,September 17 2020]

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా బాగా వినిపిస్తోంది. అయితే దీనిపై రకుల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. డ్రగ్స్ కేసులో తనకు వ్యతిరేకంగా మీడియాలో వస్తున్న కవరేజీ ఆపాలని ఐఅండ్‌బి మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ రకుల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రకుల్‌ప్రీత్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. జస్టిస్ నవీన్ చావ్లా సింగిల్ బెంచ్ ముందు విచారణ జరగనుంది.

బాలీవుడ్‌లో డ్రగ్స్ కోణం బయటపడటమే కాకుండా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రకుల్ ప్రీత్ పేరు బయటకు రావడంతో టాలీవుడ్‌లోనూ ప్రకంపనలు చెలరేగాయి. సుశాంత్ అనుమానాస్ప‌ద మృతి కేసులో డ్ర‌గ్స్ కోణం బ‌య‌ట ప‌డ‌టంతో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగి రియా చ‌క్ర‌వ‌ర్తిని, ఆమె సోద‌రుడు స‌హా మ‌రికొంత మందిని అరెస్ట్ చేసింది. ఈ వ్య‌వ‌హారంలో బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్‌, టాలీవుడ్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ పేర్ల‌ను రియా వెల్ల‌డించిన‌ట్లు వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేశాయి. దీంతో ఎన్‌సీబీ ఈ పుకార్లకు చెక్ పెట్టింది.

డ్రగ్స్ కేసు విషయమై ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్ట‌ర్ కేపీఎస్ మ‌ల్హోత్రా స్పందించారు. మాదక ద్రవ్యాలను సరఫరా చేసే ముఠా వివరాలను సేకరించామన్నారు. అయితే బాలీవుడ్ ప్రముఖుల జాబితాను మాత్రం సిద్ధం చేసుకోలేదన్నారు. కానీ అందరూ దాన్ని బాలీవుడ్ ప్రముఖుల లిస్టుగా అపార్థం చేసుకున్నారని మల్హోత్రా తెలిపారు. లిస్టులో రకుల్, రియా పేర్లు ఉన్నట్లుగా వచ్చిన వార్తలను కొట్టి పడేశారు.

More News

అల్లు అర్జున్‌పై కేసు నమోదు..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో పాటు పుష్ప సినిమా యూనిట్‌పై ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

పారు, దేవదాస్ మధ్యలో జోగి సిస్టర్స్..

బిగ్‌బాస్ షో.. ఇవాళ మాత్రం ఆసక్తికరంగా సాగింది. నేటి షోలో మన పారు, ఇద్దరు దేవదాసులతో పాటు..

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కరోనా బారినపడ్డారు. సెప్టెంబర్ 9న ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

నాగబాబుకు కరోనా పాజిటివ్..

నిర్మాత, నటుడు నాగబాబుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతి

చిత్తూరు జిల్లా తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కన్నుమూశారు. కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఆయన..