రకుల్ ...హ్యాక్
- IndiaGlitz, [Thursday,October 25 2018]
సైబర్ నేరగాళ్లు బ్యాంకులు, ఏటీఎంలు.. ఇంటర్నెట్ మోసాలే కాదు.. సినీ సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్స్‌పై కూడా ఓ కన్నేసే ఉంచుతారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నాసరే! అకౌంట్ హ్యాక్ అయిపోతుంది. ఇలా సైబర్ నేరగాళ్ల వల్ల ఇబ్బందులు పడ్డ సినీ సెలబ్రిటీలు ఎందరో.
వారి వరుసలో ఇప్పుడు రకుల్ కూడా వచ్చింది. ఎందుకంటే రీసెంట్గా రకుల్ ప్రీత్ సింగ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా రకులే తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా చెప్పింది. 'ఎవరో నా అకౌంట్‌ను హ్యాక్ చేశారు.
దయచేసి ఎవరూ నా ఇన్‌స్టాలోని లింక్స్‌ను క్లిక్ చేయకండి. ఓసారి అంతా ఓకే అయిన తర్వాత నేనే చెబుతాను. అంత వరకు స్పందించకండి' అంటూ మెసేజ్ పోస్ట్ చేసింది.