డ్రగ్స్ చాట్ చేసినట్టు అంగీకరించిన రకుల్..!

  • IndiaGlitz, [Saturday,September 26 2020]

డ్రగ్స్ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) విచారణకు శుక్రవారం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హాజరైన విషయం తెలిసిందే. దాదాపు నాలుగు గంటల పాటు ఎన్‌సీబీ అధికారులు రకుల్‌ను విచారించినట్టు సమాచారం. ఈ విచారణలో రకుల్.. కీలక విషయాలు వెల్లడించినట్టు వార్తలు వస్తున్నాయి. తాను డ్రగ్స్ చాట్ చేశానని రకుల్ అంగీకరించినట్టు టాక్ నడుస్తోంది. కాగా తానెప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని.. డ్రగ్స్ సరఫరా దారులతో సంప్రదింపులు మాత్రమే జరిపానని రకుల్ చెప్పిందట.

మరో ఆసక్తికర విషయాన్ని కూడా జాతీయ మీడియా వెల్లడించింది. ఎన్‌సీబీ విచారణలో నలుగురు సెలబ్రిటీల పేర్లు చెప్పినట్టు జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కొందరికి క్షితిజ్ రవి ప్రసాద్ అనే వ్యక్తి తన నలుగురు స్నేహితులకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు రకుల్ వెల్లడించిందని తెలుస్తోంది. క్షితిజ్ నుంచి డ్రగ్స్ తీసుకున్న ఆ నలుగురు సెలబ్రిటీల పేర్లను కూడా రకుల్ చెప్పిందని జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. క్షితిజ్ అనే వ్యక్తి మరో ఆసక్తికర విషయం కూడా ప్రచారంలో ఉంది. క్షితిజ్ అనే వ్యక్తి.. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్‌కు అత్యంత సన్నిహిత వ్యక్తి అని ప్రచారం జరుగుతోంది. దీంతో కరణ్‌ కూడా నెక్ట్స్ ఎన్‌సీబీ విచారణను ఎదుర్కోబోతున్నారని టాక్ నడుస్తోంది.