గాలి పెళ్లిలో డ్యాన్స్ కి రకుల్ అంత తీసుకుందా..!
Send us your feedback to audioarticles@vaarta.com
గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె బ్రాహ్మణి పెళ్లిని కనీవినీ ఎరుగని రీతిలో చేసారు. ఈ పెళ్లికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. దాదాపు 500 కోట్ల రూపాయలతో ఈ పెళ్లి జరిగిందట. ఈ పెళ్లికి సాయికుమార్, విశాల్, బ్రహ్మానందం, రాధిక, మీనా, శ్రియ, నిరోషా తదితరులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే....ఈ పెళ్లిలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ డ్యాన్స్ చేసింది.
అయితే...ఈ డ్యాన్స్ కి రకుల్ ప్రీత్ సింగ్ అక్షరాల కోటి రూపాయలు తీసుకుంది అని ప్రచారం జరుగుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ రామ్ చరణ్ తో ధృవ, మహేష్ - మురుగుదాస్ మూవీ, నాగచైతన్య - కళ్యాణ్ కృష్ణ మూవీ...ఇలా స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకెళుతుంది. ఒక్క సినిమాలోనటిస్తే కోటి రూపాయలు రెమ్యూనరేషన్ ఇవ్వచ్చేమో...అయితే పెళ్లిలో డ్యాన్స్ చేసినందుకే రకుల్ కోటి రూపాయలు తీసుకుంది అనేది హాట్ టాపిక్ అయ్యింది..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments