తమన్నా తరహాలో రకుల్ కూడా..

  • IndiaGlitz, [Monday,October 26 2015]

త‌మ‌న్నా అడుగుజాడ‌ల్లోనే ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌డుస్తోందా? అవున‌నే వినిపిస్తోంది టాలీవుడ్‌లో. ఇంత‌కీ ర‌కుల్ ఏ విష‌యంలో త‌మ‌న్నాని ఫాలో అవుతుందంటే.. డాన్సింగ్ స్కిల్క్‌ని పెంచుకోవ‌డం గురించి. కెరీర్ ప్రారంభంలో త‌మ‌న్నా డ్యాన్స్‌లో ఏమంత గ్రేస్ ఉండేది కాదు.. ఎప్పుడైతే అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ ప‌క్క‌న వ‌రుస‌గా అవ‌కాశాల‌ను పొందిందో.. అప్ప‌ట్నుంచీ ఆ విష‌యంలో ఎంతో డెవ‌ల‌ప్ అయింది. క‌ట్ చేస్తే.. ఇప్పుడున్న హీరోయిన్స్‌లో త‌మ‌న్నా నెం.1 డ్యాన్స‌ర్‌గా పేరు తెచ్చుకుంది.

ఇప్పుడు ర‌కుల్ ది కూడా ఇదే ప‌రిస్థితి. 'బ్రూస్‌లీ' కోసం రామ్‌చ‌ర‌ణ్‌తో ఆడిపాడిన ర‌కుల్‌.. ఆ త‌రువాత వెంట‌వెంట‌నే ఎన్టీఆర్‌తో 'నాన్న‌కు ప్రేమ‌తో', బ‌న్నితో 'స‌రైనోడు' కోసం అవ‌కాశాల‌ను పొందింది. దీంతో డ్యాన్స్‌లో ది బెస్ట్ అనిపించుకున్న ముగ్గురు అగ్ర‌తార‌ల‌తో వ‌రుస‌గా న‌టించే ఛాన్స్ రావ‌డంతో ర‌కుల్ డ్యాన్స్ ఇంఫ్రూవ్ అవుతోంద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు ముచ్చ‌టించుకుంటున్నాయి. మొత్తానికి త‌మ‌న్నా త‌రువాత ఆ స్థాయిలో ర‌కుల్ కూడా రాణించే దిశ‌గా ఉంద‌న్న‌మాట‌.

More News

ఉమెనూ వైనూ ఒకటేనా?

ఉమెన్,వైన్ ఒకటే.రెండూ పాత బడే కొద్దీ చాలా బావుంటాయి అని అంటోంది బాలీవుడ్ సెక్స్ సైరన్ బిపాసాబసు.తాజాగా ఆమె బుల్లితెరకు ఓ హారర్ సీరీస్ తో ఎంట్రీ ఇస్తోంది.

నాగార్జున విలనిజం

నాగార్జున ఇప్పుడు విలన్ గా నటించడానికి సిద్ధమయ్యారు.ఓ వైపు సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో హీరోగా ద్విపాత్రాభినయం చేస్తున్న నాగార్జున నిర్మలా కాన్వెంట్,అఖిల్ చిత్రాల్లో కేమియో ఇవ్వనున్నారు.

మాడా మృతి తీరని లోటు - డా.మోహన్ బాబు

మాడా వెంకటేశ్వరరావు సీనియర్ కమెడియన్గా తన మార్కు పాత్రలతో మూడు వందలకు పైగా చిత్రాల్లోనటించి మెప్పించారు. ఆనారోగ్య కారణంగా ఆయన తెలుగు ప్రేక్షకులను విడిచిపెట్టి పోవడం చాలా బాధాకరం.

క‌మ‌ర్షియ‌ల్ తో కూడిన అంద‌మైన ప్ర‌యోగాత్మ‌క చిత్రం కంచె : చిరంజీవి

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ హీరోగా క్రిష్ తెర‌కెక్కించిన చిత్రం కంచె. రెండ‌వ ప్ర‌పంచ యుద్ధం నేప‌థ్యంతో రూపొందిన కంచె సినిమా ద‌స‌రా రోజు రిలీజై విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది.

ఎన్టీఆర్ పక్కన అమైరా

ఎన్టీఆర్ ప్రస్తుతం నాన్నకు ప్రేమకు టీజర్ ఇచ్చిన కిక్ ను ఆస్వాదిస్తున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడిగా ఆదివారం మరో సినిమా ప్రారంభం కానుంది.