హీరో రక్షిత్ అట్లూరి బర్త్ డే సందర్బంగా హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన 'శశివదనే' టీం
Send us your feedback to audioarticles@vaarta.com
యువ కథానాయకుడు రక్షిత్ అట్లూరి హీరోగా గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఎస్వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి. భాగస్వామ్యంతో ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె, తమిళ నటుడు శ్రీమాన్, కన్నడ నటుడు దీపక్ ప్రిన్స్, 'రంగస్థలం' మహేష్ నటీనటులుగా సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు .ఈ రోజు చిత్ర హీరో రక్షిత్ అట్లూరి బర్త్ డే ను పురస్కరించుకొని చిత్ర యూనిట్ హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది.ఈ సందర్బంగా
చిత్ర నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ.. గోదావరి నేపథ్యంలో తీస్తున్న లవ్ అండ్ యాక్షన్ డ్రామా ఈ ‘శశివదనే’ చిత్రంలో లవ్ సీన్స్ చాలా కొత్తగా ఉంటాయి. దర్శకుడు సాయి మోహన్ ఉబ్బన ఈ సినిమాను చాలా గ్రాండియర్‌గా, హై స్టాండర్డ్స్‌లో తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి మ్యూజిక్, విజువల్స్ హైలైట్ గా నిలుస్తాయి.ఇందులో ఉన్న ఐదు పాటలు అద్భుతంగా వచ్చాయి. నటీ, నటులు సాంకేతిక నిపుణులు అందరూ సపోర్ట్ చేయడంతో ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.ఇప్పటివరకు తీసిన సన్నివేశాలు చూసుకున్నాం చాలా బాగా వచ్చాయి.మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాము అన్నారు.
నటీ నటులు: రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె, తమిళ నటుడు శ్రీమాన్, కన్నడ నటుడు దీపక్ ప్రిన్స్, 'రంగస్థలం' మహేష్ తదితరులు
సాంకేతిక నిపుణులు: పీఆర్వో: సురేంద్రకుమార్ నాయుడు - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), ఎడిటర్: గ్యారీ బీహెచ్, కలరిస్ట్: ఎ. అరుణ్ కుమార్ (డెక్కన్ డ్రీమ్స్), సీఈవో: ఆశిష్ పెరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీపాల్ చొల్లేటి, ఛాయాగ్రహణం: సాయికుమార్ దార, సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ, కరుణాకర్ అడిగర్ల, సంగీతం: శరవణ వాసుదేవన్, కాస్ట్యూమ్స్ - సమర్పణ: గౌరీ నాయుడు, నిర్మాత: అహితేజ బెల్లంకొండ, రచన - దర్శకత్వం: సాయిమోహన్ ఉబ్బన
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments