రష్మిక బ్రేకప్‌పై ఆమె తల్లి ప్రకటన.. రక్షిత్ స్పందన...
Send us your feedback to audioarticles@vaarta.com
కన్నడంలో కిర్రిక్ పార్టీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్నా.. తొలి చిత్రంతో మంచి సక్సెస్ సాధించడంతో హీరో రక్షిత్‌తో ప్రేమలో పడింది. ఇద్దరి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలపడంతో.. పెళ్లి చేయడానికి నిశ్చయించుకున్నారు. నిశ్చితార్థం కూడా జరిగింది. రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఇద్దరు.
అయితే ఈ గ్యాప్‌లో ఏమైందో ఏమో కానీ.. రక్షిత్, రష్మిక మధ్య వ్యవహారం చెడిందట. ఇద్దరికీ బ్రేకప్ అయ్యిందని చాలా రోజుల నుండి సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై రష్మిక తల్లి సుమన్ సోషల్ మీడియాలో ప్రకటన చేస్తూ రష్మిక నిశ్చితార్థం రద్దు అయినట్లు ప్రకటించారు.
దీనిపై రక్షిత్ కూడా స్పందిస్తూ ``ఎవరూ రక్షితను టార్ట్ చేయవద్దని కోరాడు.అయితే రష్మిక వ్యవహారంతో అభిమానుల ప్రశ్నలకు, మీడియాలో వస్తున్న వార్తలపై సమాధానం ఇవ్వడానికి రక్షిత్ ఫేస్బుక్ అకౌంట్‌ను ఓపెన్ చేశారు. ఫేస్బుక్ ద్వారా స్పందించిన రక్షిత్ ``నేను గత కొంత కాలం సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. రష్మిక గురించి ఎవేవో అభిప్రాయాలు రాస్తున్నారు. అది వారి విషయం. దీనిపై నేను ఎవరినీ వేలెత్తి చూలేను. ఎందుకో అలా జరిగిపోయింది. మనం ఒక్కొక్కసారి కళ్లతో చూసింది కూడా నిజం కాకపోవచ్చు. మరోవైపు నుండి ఆలోచించకుండా నిర్ణయానికి వచ్చేస్తుంటాం. రష్మిక నాకు రెండేళ్లుగా తెలుసు. ఆమె గురించి నాకు బాగా తెలుసు. ఆమెను ప్రశాంతంగా ఉండనివ్వండి. త్వరలోనే నిజాలు బయటకు వచ్చి అంతా సద్దుమణుగుతుందనే నమ్ముతున్నాను. అవసరాల కోసం ఊహగానాలను క్రియేట్ చేస్తున్నారు. నా ఫేస్బుక్ పేజీ ఓపెన్లోనే ఉంటుంది. మళ్లీ అవసరం వచ్చినప్పుడు స్పందిస్తాను. సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి రష్మికకు సంబంధం లేదు. సోషల్ మీడియాకు అలవాటు పడిపోకూడదనేదే కారణం. ఓ పని మీద ఫోకస్ చేయాలనుకుంటున్నాను`` అంటూ రక్షిత్ పెర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout