Sasivadane:'శశివదనే' నుంచి లిరికల్ సాంగ్ 'డీజే పిల్లా' రిలీజ్

  • IndiaGlitz, [Monday,September 04 2023]

నా దిల్లే నీ వల్లే
టూరింగు టాకీసులా మారెనే
నా కల్లో నీ బొమ్మనే
షో మీద షో వేసి చూపించనే
డీజే పిల్లా ఎదలో ఇల్లా
విజిలే వేసి బీటే కొట్టగా ..

అని కుర్రాడు తన ప్రేయసి తన మనసులోని ప్రేమను పాట రూపంలో చెప్పేస్తున్నాడు. ఇంతకీ అబ్బాయి, అమ్మాయి మధ్య ఎందు ప్రేమ పుట్టింది. వారి ప్రేమ మజిలీ ఏంటి? అనేది తెలుసుకోవాలంటే 'శశివదనే' సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ హీరో హీరోయిన్ గా నటించారు. 'డీజే పిల్లా..' పాటకు కిట్టు విస్సా ప్రగడ సాహిత్యాన్ని అందించగా వైషాగ్ పాటను పాడారు. శరవణ వాసుదేవన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. సోమవారం ఈ సినిమా నుంచి 'డీజే పిల్లా..' పాటను విడుదల చేశారు. గౌరి నాయుడు సమర్పణలో ఎ.జి.ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్ బ్యానర్స్ పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహిస్తున్నారు. గోదావ‌రి బ్యాక్‌డ్రాప్‌లో అంద‌మైన ప్రేమ‌క‌థ‌గా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా...

చిత్ర నిర్మాతలు అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ మా 'శశివదనే' సినిమా విడుదలకు సన్నద్ధమవుతుంది. హార్ట్ టచింగ్ లవ్ కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కింది. మంచి లవ్ మూవీ వచ్చి చాలా రోజులువుతుందని అందరూ అనుకుంటున్నారు. వారి కోరిక ఈ సినిమాతో తీరుతుందని అనుకుంటున్నాను. మా మీరో రక్షిత్, హీరోయిన్ కోమలి ప్రసాద్ సినిమాలో అలా ఒదిగిపోయారంతే. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తాం అన్నారు.

నటీనటులు: రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్

More News

Kushi:'ఖుషి' కలెక్షన్ల ఊచకోత.. మూడు రోజుల్లో 70.23 కోట్ల వసూళ్లు, అమెరికాలో 2 మిలియన్ల దిశగా

విజయ్ దేవరకొండ, సమంత జంటగా ప్రేమ కథల స్పెషలిస్ట్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘‘ఖుషి’’.

BiggBoss Telugu 7:గ్రాండ్‌గా లాంచైన ‘‘బిగ్‌బాస్-7’’ : టెస్టెంట్స్ వీరే, లిస్ట్‌లో శివాజీ, షకీలా.. ఈసారి మామూలుగా వుండదట

రోటీన్‌కు భిన్నంగా ఈ సీజన్‌లో కంటెస్టెంట్ల ఎంపిక జరిగింది. గడిచిన ఆరు సీజన్ల వరకు 21 మంది పాల్గొనగా..

Chandrababu Naidu:చెప్పినంత ఇవ్వకుంటే .. బెదిరింపులు, చంద్రబాబు 'ముడుపుల' దందా ఇలా..?

40 ఇయర్స్ ఇండస్ట్రీ అని, నిప్పులా బతికానని చెప్పుకునే టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అవినీతి గురించి దశాబ్ధాలుగా ఎందరో విమర్శలు చేస్తూనే వున్నారు.

ఏడో సీజన్ తో బిగ్ బాస్ వస్తున్నాడు !!

అనుక్షణం ఉత్కంఠ.. ప్రతి క్షణం ఉత్సాహం.. ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియని థ్రిల్.. కలగలిసిన ఒక సంచలనానికి “స్టార్ మా” సెప్టెంబర్ 3 న తెరతీయబోతోంది.

ISRO Aditya L1:అగ్రరాజ్యాలకు మరో సవాల్ విసిరిన ఇస్రో.. విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్ 1

చంద్రయాన్ 3 సక్సెస్‌తో ప్రస్తుతం ఇస్రో మంచి ఊపులో వుంది. దీనిలో భాగంగా సూర్యుడిపై ప్రయోగాలకు సిద్ధమైంది.