ఒళ్ళు గగుర్పొడిచేలా 'రాక్షసుడు 2' పోస్టర్.. లీడ్ రోల్ లో స్టార్ హీరో?
Send us your feedback to audioarticles@vaarta.com
బెల్లం కొండ శ్రీనివాస్ నటించిన రాక్షసుడు చిత్రం గుర్తుందిగా. తమిళంలో విష్ణు విశాల్ నటించిన రాక్షసన్ చిత్రానికి రాక్షసుడు తెలుగు రీమేక్ గా తెరకెక్కింది. సైకో థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం 2019లో విడుదలై మంచి విజయం అందుకుంది. సైకో థ్రిల్లింగ్ ఎలెమెంట్స్, ఒళ్ళు గగుర్పాటుకు గురిచేసే క్రైమ్ సన్నివేశాలు ప్రేక్షకులని సీట్ ఎడ్జ్ మీద కూర్చునేలా చేశాయి.
రమేష్ వర్మ దర్శకత్వంలో రాక్షసుడు చిత్రం తెరకెక్కింది. తాజాగా దర్శకుడు రమేష్ వర్మ ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటించారు. టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేస్తూ షూటింగ్ త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి 'రాక్షసుడు 2' అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
టైటిల్ పోస్టర్ ఒళ్ళు గగుర్పాటుకు గురిచేసేలా భయంకరంగా ఉంది. ఈసారి థ్రిల్, ఉత్కంఠ డబుల్ కాబోతున్నట్లు ఈ పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ తెలియజేసింది. పోస్టర్ లో రక్తంతో తడిచిన కత్తి హైలైట్ అవుతుంటే.. బ్యాగ్రౌండ్ లో సైకో ఓ డెడ్ బాడీని తన భుజాలపై మోస్తూ తీసుకెళుతున్నాడు. సీక్వెల్ కి కూడా రమేష్ వర్మనే దర్శకుడు.
సత్యనారాణయ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. జిబ్రాన్ సంగీత దర్శకుడు. ప్రస్తుతం రమేష్ వర్మ రవితేజతో 'ఖిలాడీ' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఓ కొలిక్కి రాగానే రాక్షసుడు 2 షూట్ ప్రారంభం కానుంది.
ఓ సైకో స్కూల్ లో చదువుకునే చిన్న పిల్లలని అతి కిరాతకంగా చంపి ఆనందిస్తూ హింట్స్ ఇస్తుంటాడు. ఆ సైకోని యువ పోలీస్ ఎలా నిలువరించాడు అనే కథాంశంతో రాక్షసుడు చిత్రం తెరకెక్కింది. మరి సీక్వెల్ లో దర్శకుడు ఎలాంటి లైన్ సిద్ధం చేశాడో.. ఈసారి సైకో టార్గెట్ ఎవరో అనేవి తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. సీక్వెల్ లో ఓ స్టార్ హీరో లీడ్ రోల్ లో నటించబోతున్నారు. ఆ హీరో ఎవరనేది త్వరలోనే ప్రకటిస్తారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com