ఆంజనేయ స్వామియే మా సినిమాకు బ్రాండ్ అంబాసిడర్ - వంశీకృష్ణ ఆకెళ్ళ
Send us your feedback to audioarticles@vaarta.com
అందరూ పూజించే ఆంజనేయస్వామి పాత్ర చుట్టూనే మా సినిమా తిరుగుతుంది. రక్షకభటుడు అనేది చాలా పవర్‌ఫుల్ టైటిల్. అలాంటి టైటిల్ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. దిల్‌రాజుగారు, శిరీష్‌గారు, ఎం.ఎస్.రాజుగారు, ఇలా ఎంతో మంది నా సినిమా కథ విన్నప్పటి నుండి ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు అని అన్నారు దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ళ. రక్ష, జక్కన్న వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలు తర్వాత దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో సుఖీభవ మూవీస్ బ్యానర్‌పై ఎ.గురురాజ్ నిర్మించిన చిత్రం `రక్షకభటుడు`. వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో రూపొందిన మూడో చిత్రమే `రక్షకభటుడు`. ఈ చిత్రం మే 12న విడుదలకానుంది.
ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు వంశీ కృష్ణ ఆకెళ్ళ సినిమా గురించి సంగతులను తెలియజేశారు. మోషన్ పోస్టర్ విడుదలైనప్పటి నుండి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్‌కు కూడా ఆడియెన్స్ నుండి హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. నిర్మాత గురురాజ్‌గారు కథ విన్నప్పటి నుండి సినిమా పూర్తయ్యే వరకు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అందరినీ ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపించారు. బ్రహ్మానందంగారు పాత్ర చేయడమే ఎంతో సపోర్టివ్‌గా నిలబడ్డారు. సినిమాటోగ్రాఫర్ మల్హర్‌భట్ జోషి, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర, ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ నాయర్ ఇలా అందరూ టెక్నిషియన్స్‌తో పాటు నిర్మాణ, నిర్వహణ జె.శ్రీనివాసరాజుగారు ఎంతో సహకారం అందించారు. ఇక నటీనటుల్లో హీరోయిన్ రిచాపనయ్ చాలా మంచి పాత్రలో కనిపిస్తుంది. కంటెంటే హీరోగా స్టార్ట్ అయిన మా సినిమాలో ధనరాజ్, ప్రభాకర్, సుప్రీత్ ఇలా అందరూ సపోర్ట్‌తో మంచి సినిమా చేశామని చెప్పగలను. సినిమాను మే 12న విడుదల చేస్తున్నామని, ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.
రక్షకభటుడు సినిమా కోసం నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ రాత్రింబగళ్ళు పనిచేశారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే సస్పెన్స్ అల్రెడి విడిపోయింది. అలాగే మా రక్షకభటుడు సినిమాలో ఆంజజేయు స్వామి గెటప్ వేసిన హీరో ఎవరనే సస్పెన్స్ కూడా మరో ఐదు రోజుల్లో తీరిపోతుంది. గ్రాఫిక్స్ మిళితమైన సినిమా ఇది. కామెడి, హర్రర్, సస్పెన్స్ సహా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న సినిమా. భవిష్యత్‌లో మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకంటున్నానని నిర్మాత గురురాజ్ చెప్పారు.
ఇంకా కార్యక్రమంలో ని రిచా పనయ్, బాహుబలి ప్రభాకర్, రామ్‌జగన్, మధు, జ్యోతి, కృష్ణేశ్వర్ తదితరులు పాల్గొని మే 12న విడుదలయ్యే సినిమాను పెద్ద హిట్ చేయాలని ప్రేక్షకులను కోరారు.
రిచాపనయ్, బ్రహ్మానందం, బాహుబలి ప్రభాకర్, బ్రహ్మాజీ, సుప్రీత్ (కాట్రాజు), అదుర్స్ రఘు, ధనరాజ్, నందు, చిత్రం శ్రీను, సత్తెన్న, జ్యోతి, క ష్ణేశ్వర్‌రావు, మధు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: మల్హర్ భట్ జోషి, ఆర్ట్: రాజీవ్‌నాయర్, ఎడిటింగ్: అమర్ రెడ్డి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, నిర్మాణ, నిర్వహణ: జె. శ్రీనివాసరాజు, ప్రొడ్యూసర్: ఎ.గురురాజ్, రచన, దర్శకత్వం: వంశీకృష్ణ ఆకెళ్ల.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments