క్రేజీ క్రేజీగా రూపొందుతున్న 'రక్షక భటుడు'
- IndiaGlitz, [Saturday,January 21 2017]
రిచా పనాయ్, 'బాహుబలి' ప్రభాకర్, బ్రహ్మానందం, కాట్రాజు, బ్రహ్మాజీ,ధనరాజ్, నందు ముఖ్య తారలుగా వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వం లో సుఖీభవ మూవీస్ పతాకంఫై గురురాజ్ నిర్మిస్తున్న చిత్రం 'రక్షక భటుడు'. ఇప్పటికి 60 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది.ఈ సందర్భం గా దర్శకుడు వంశీ కృష్ణ ఆకెళ్ల మాట్లాడుతూ - " క్రేజీ కథాంశంతో క్రేజీ క్రేజీగా ఈ సినిమా రూపొందుతోంది.నేను ఇంతకు ముందు డైరెక్ట్ చేసిన 'రక్ష' , 'జక్కన్న' చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ కథాంశం ఉంటుంది
ఇందులో ఓ స్పెషల్ స్టార్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు.ఇటీవల మేము విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది.ఆంజనేయస్వామి ముఖంతో ఉన్న పోలీస్ ఆఫీసర్ ఎవరో చెప్పమంటూ చాలా మంది క్యూరియాసిటీ ప్రదర్శించారు. ఆ పాత్రను పోషించిన స్పెషల్ స్టార్ ను సినిమా రిలీజ్ వరకూ సస్పెన్సుగా ఉంచదలిచాం" అని తెలిపారు. నిర్మాత గురురాజ్ మాట్లాడుతూ - "ఈ సబ్జెక్ట్ వినగానే చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. వెంటనే ఈ సినిమా చేయడానికి రెడీ అయ్యాను. ఇండస్ట్రీలోని ముఖ్య తారలంతా ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జనవరి ప్రథమార్ధం లో జరిపిన షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు, ఇంటర్వెల్ ఎపిసోడ్స్ చిత్రీకరించాము. ఫిబ్రవరి లో జరిపే షెడ్యూల్ తో సినిమా మొత్తం పూర్తవుతుంది." అని చెప్పారు.
'అదుర్స్' రఘు , 'చిత్రం' శీను, గురురాజ్, సత్తన్న, జ్యోతి, కృష్ణేశ్వర రావు, మధు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : మల్హర్ భట్ జోషి, సంగీతం: దినేష్, ఆర్ట్స్: రాజీవ్ నాయర్, ఎడిటింగ్ :అమర్ రెడ్డి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, నిర్మాత: గురురాజ్, రచన -దర్శకత్వం: వంశీకృష్ణ ఆకెళ్ల