ఏప్రిల్ ద్వితీయార్ధంలో 'రక్షకభటుడు'
- IndiaGlitz, [Wednesday,April 05 2017]
సాధారణంగా దెయ్యాలకు దేవుడంటే భయమని మనం చదువుతుంటాం..సినిమాల్లో చూస్తుంటాం. కానీ ఓ దెయ్యానికి దేవుడు సహాయం చేయడం గురించి తెలుసా..అది తెలుసుకోవాలంటే 'రక్షకభటుడు' సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ళ. సుఖీభవ మూవీస్ పతాకంపై ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎ. గురురాజ్ నిర్మాతగా రూపొందుతోన్న ఫాంటసీ సస్పెన్స్ థ్రిల్లర్ కమర్షియల్ ఎంటర్టైనర్ రక్షకభటుడులో రిచాపనై, బ్రహ్మానందం, బాహుబలి ప్రభాకర్, బ్రహ్మాజీ, సుప్రీత్(కాట్రాజు). అదుర్స్ రఘు, ధనరాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రక్ష, జక్కన వంటి సూపర్‌హిట్ చిత్రాల తర్వాత వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ సినిమాను ఏప్రిల్ ద్వితీయార్ధంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
రక్షకభటుడు సినిమా మోషన్ పోస్టర్ నుండి సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. రీసెంట్ విడుదలైన థియేట్రికల్ ట్రైలర్‌కు ఆడియెన్స్ నుండి ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తుంది. అరకులోయ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది. అసలు ఆంజనేయస్వామికి, రక్షకభటుడు అనే టైటిల్‌కు ఉన్న రిలేషన్ ఏంటి? అనేదాన్ని ఆసక్తికరంగా రూపొందించాం. ఎమోషన్స్, కామెడి, థ్రిల్లింగ్, సస్పెన్స్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ సినిమాలో ఉంటాయి. ఫస్ట్ సీన్ నుండి క్లైమాక్స్ వరకు సినిమా ఎంటర్టైనింగ్గా సాగుతుంది. చివరి పదిహేను నిమిషాలు హృద్యయంగా తెరకెక్కించాం. శేఖర్ చంద్ర మ్యూజిక్, మల్హర్‌భట్ జోషి సినిమాటోగ్రఫీ, డ్రాగన్ ప్రకాష్ యాక్షన్, బ్రహ్మానందం హిలేరియస్ కామెడి, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు ఆడియెన్స్ ఎంగేజ్ చేస్తుంది. సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి యూనిట్ అంతా రాత్రి పగలు నిరాటంకంగా పనిచేస్తున్నారు. సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఆది పూర్తైన తర్వాత సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ ద్వితీయార్థంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ళ, నిర్మాత ఎ.గురురాజ్ తెలిపారు.