ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
Send us your feedback to audioarticles@vaarta.com
మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘ట్రిపుల్ తలాక్’ బిల్లు పెద్దల సభ ఆమోదం పొందింది. 16వ లోక్‌సభ కాలంలోనే ట్రిపుల్ తలాక్ బిల్లుకి లోక్‌సభలో ఆమోదం లభించినప్పటికీ ఇప్పటి వరకూ రాజ్యసభ ముందుకు రాలేదు. అయితే.. మంగళవారం నాడు ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదించింది. దీంతో ఉభయ సభల్లో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం లభించినట్లైంది. బిల్లుకు అనుకూలంగా 99, వ్యతిరేకంగా 84 ఓట్లు వచ్చాయి. ఇవాళ అంతకుముందు బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఇక రాజ్యసభలోనూ ఈ బిల్లు ఆమోదం పొందడంతో చట్టరూపం దాల్చనుంది. 16వ లోక్‌సభ కాలంలోనే ట్రిపుల్ తలాక్ బిల్లుకి లోక్‌సభలో ఆమోదం లభించింది. అయితే.. రాజ్యసభలో మెజార్టీ లేని కారణంగా ముందుకు కదల్లేదు. త్వరలో రాష్ట్రపతి వద్దకు ట్రిపుల్ తలాక్ బిల్లు వెళ్లనుంది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ట్రిపుల్ తలాక్ రద్దు కానుంది.
రెండు సార్లు ఫెయిల్.. మూడోసారి సక్సెస్!
ఇదిలా ఉంటే.. ట్రిపుల్ తలాక్ రాజ్యంగ విరుద్ధమని 2017లో సుప్రీంకోర్టు తేల్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజ్యసభలో రెండుసార్లు ట్రిపుల్ తలాక్ బిల్లు వీగిపోయింది. అయితే మూడోసారి ట్రిపుల్ తలాక్ బిల్లు గట్టెక్కింది. ఈ బిల్లుతో 9 కోట్ల మంది ముస్లిం మహిళలకు ఊరట లభించినట్లైంది. కాగా మొదట రాజ్యసభలో ఎన్డీఏకు తగిన మెజార్టీ లేకపోవడంతో బిల్లు ఆమోదం పొందుతుందా? లేదా? అనే విషయంలో సందిగ్ధం నెలకొంది.
ఓటింగ్‌కు దూరంగా ఉన్న పార్టీలివీ!
టీఆర్ఎస్, టీడీపీ, జేడీయూ పార్టీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. జేడీయూ, అన్నాడీఎంకే వాకౌట్ చేయడంతో ఎన్డీఏకు లైన్ క్లియరైంది. కాంగ్రెస్ సహా టీఎంసీ, బీఎస్పీ, ఆప్, వామపక్షాలు, వైసీపీ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశాయి. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు స్లిప్పుల ద్వారా ఓటింగ్ నిర్వహించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments