ఏపీలో కొనసాగుతున్న రాజ్యసభ ఎన్నికలు
Send us your feedback to audioarticles@vaarta.com
నేడు ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ తరపున తొలి ఓటు ముఖ్యమంత్రి జగన్ వేయగా.. టీడీపీ తరుపున హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ తొలి ఓటు వేశారు. ఇప్పటికే మాక్ పోలింగ్‌ను నిర్వహించిన ఇరు పార్టీలు.. తమ పార్టీల ఎమ్మెల్యేలకు ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలో తెలిపాయి. కాగా వైసీపీ తరపున పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, పరిమాల్ నత్వాని, అయోధ్య రామిరెడ్డి, అలాగే టీడీపీ నుంచి వర్ల రామయ్య బరిలో నిలిచారు.
వైసీపీ తరుఫున పోటీ చేసిన తొలి ముగ్గురు ఎమ్మెల్యేలకు 38.. నాలుగో అభ్యర్దికి 37 ఓట్లను వైసీపీ కేటాయించింది. అయితే టీడీపీ కీలక నేత అరెస్ట్ అయిన కారణంగా ఆయన ఓటేసేందుకు హాజరు కాలేదు. ఆయనకు ఓటేసేందుకు అవకాశం కల్పించాలని టీడీపీ నేతలు ఈసీని కోరారు. ఈసీ అనుమతిస్తే అచ్చెన్నాయుడు కూడా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout