'రాజుగాడు' టీజ‌ర్ అప్‌డేట్‌

  • IndiaGlitz, [Tuesday,March 13 2018]

'ఉయ్యాలా జంపాలా', 'సినిమా చూపిస్త మావ', 'కుమారి 21ఎఫ్'.. ఇలా వరుసగా యూత్‌ఫుల్‌ సినిమాలతో యూత్‌కు బాగా దగ్గరైన హీరో రాజ్ తరుణ్. ప్రస్తుతం సంజనా రెడ్డి దర్శకత్వం వహించిన 'రాజుగాడు' చిత్రంలో నటిస్తున్నారు ఈ యువ క‌థానాయ‌కుడు.ఇందులో రాజ్ తరుణ్ సరసన అమైరా దస్తూర్ కథానాయికగా నటిస్తోంది.

చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారయ్యింది. ఉగాదిని పురస్కరించుకుని ఈ నెల 18న టీజరును విడుదల చేయడానికి నిర్మాత నిర్ణయించుకున్నారు. చాలా జాగ్రత్తగా.. అంచనాలు భారీగా పెరిగే విధంగా టీజర్ ను కట్ చేశారని సమాచారం.

అలాగే.. దర్శకురాలు ఈ సినిమాని యూత్‌కు నచ్చే విధంగా మలిచారని కూడా చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌తోనైనా మళ్ళీ విజయాల బాట పట్టాలని రాజ్ తరుణ్ ఆశ పడుతున్నారు. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.