పవన్ రాజకీయాలకు పనికిరాడు: ప్రాణ స్నేహితుడు షాకింగ్ కామెంట్స్
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఊహించని రీతిలో భారీ షాక్ తగిలింది. పవన్ అత్యంత సన్నిహితుడు, జనసేన పార్టీ పెట్టడానికి కర్త, కర్మ, క్రియ అయినటువంటి రాజు రవితేజ్ పార్టీకీ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. రాజా ఊహించని షాకివ్వడంతో అటు పవన్.. ఇటు జనసేన కార్యకర్తలు, మెగాభిమానులు ఆలోచనలో పడ్డారు. ఈ మేరకు తాను పార్టీకి దూరంగా ఉంటానని తన ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అంతే కాదు ఈ ప్రకటనలో పవన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో.. ఇటు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాయి.
ప్రకటనలో ఏముంది!?
‘పవన్‌తో కానీ.. జనసేన పార్టీతో కానీ నాకు ఎలాంటి సంబంధం ఉండదు. పవన్ కోరిక మేరకు నాకు ఇష్టం లేకపోయినప్పటికీ పొలిట్ బ్యూరోలో చేరాను. పార్టీ భావజాలం, రాజ్యాంగాన్ని సృష్టించి, పార్టీని ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించాను. జనసేన మెదటి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాను. ప్రస్తుతం నేను పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిని. పవన్ కోరిక మేరకు నాకు ఈ పదవి ఇష్టం లేకపోయినా అంగీకరించాను. ఇక మీదట నేను పవన్ కళ్యాణ్‌తో, జనసేనతో కలిసి పని చేయను. ఒకప్పుడు మంచి వ్యక్తి అయిన పవన్.. ప్రస్తుతం కక్ష సాధింపుతనం, కుల, మతపరమైన ద్వేషంతో నడిచే ప్రమాదకరమైన విభజన శక్తిగా మారిపోయారు. రాజకీయాలకు పవన్ కళ్యాణ్ ప్రమాదకరంగా మారాడు. ఇక ముందు పవన్ కల్యాణ్‌తో కలిసి పని చేయబోనని ప్రకటించారు. రాజకీయ లేదా సామాజిక శక్తి ఉన్న పదవిని ఆక్రమించటానికి అతణ్ని అనుమతించకూడదు. పవన్ ఎలాంటి రాజకీయ అధికారానికి అర్హుడు కాదు. అర్హత లేకుండా పొందినది.. అనుమతి లేకుండా వెళ్లిపోతుంది’ అని రాజు రవితేజ్ ఈ ప్రకటనలో రాసుకొచ్చారు.
కాగా.. ఇప్పటికే పార్టీ పెట్టినప్పుడు కీలకంగా వ్యవహరించిన ఎందరో నేతలు దూరం అవ్వగా.. తాజాగా తన రాజకీయ భావాలు పెంపొందించుకోవడానికి మెయిన్ పిల్లర్‌గా ఉపయోగపడిన రాజు రవితేజను దూరం కావడంతో పార్టీ నుంచి మున్ముంథు ఎవరెవరు జంప్ అయిపోతారో అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈయన రాజీనామాను జనసేన కూడా ఆమోదించింది. ఈ వ్యవహారంపై పవన్ వీరాభిమానులు రాజాపై దుమ్మెత్తి పోస్తుండగా.. జనసేనాని ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments