సెన్సార్ పూర్తి చేసుకున్న 'రాజు గారింట్లో 7వ రోజు'

  • IndiaGlitz, [Tuesday,January 12 2016]

అజయ్, భరత్, అర్జున్, వెంకటేష్, సుష్మిత ప్రధాన పాత్రల్లో భరత్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ఫిరోజ్ రాజ దర్శకత్వంలో భరత్ కుమార్ పీలం నిర్మించిన సినిమా 'రాజుగారింట్లో 7వ రోజు'. ఈ చిత్రం రీసెంట్ గా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ను పొందింది. ఈ సినిమాను ఈ జనవరి నెలలో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా..

భరత్ మాట్లాడుతూ ' ఈ మధ్య కాలంలో హారర్ సబ్జెక్ట్స్ తో వస్తోన్న సినిమాలన్నీ మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. సినిమాలో కంటెంట్ బావుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ట్రైలర్స్, సాంగ్స్ చాలా బావున్నాయి. మూవీ అవుట్ పుట్ బాగా వచ్చింది. మంచి హారర్ ఫిలిం. ఖచ్చితంగా సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. ట్రైలర్స్, సాంగ్స్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది'' అని చెప్పారు.

దర్శకుడు ఫిరోజ్ రాజ మాట్లాడుతూ.. ''క్రైమ్ ఆధారంగా రూపొందించిన ఓ హారర్ ఫిలిం ఇది. స్క్రీన్ ప్లే చాలా బావుంటుంది. ప్రతి ఒక్కరు కష్టపడి ఈ సినిమా చేశారు. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ నెలలో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.

ఈ చిత్రానికి నిర్మాత: భరత్ కుమార్ పీలం, రచన,దర్శకత్వం: ఫిరోజ్ రాజ, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: క్రాంతి కె.కుమార్, మ్యూజిక్: కనిష్క్, ఎడిటర్: అనిల్, స్టిల్స్: నాగభూషణం.

More News

సూపర్ స్టార్ మూవీకి ప్రిన్స్ ప్రచారం..

దాదాపు 350 సినిమాల్లో నటించినా...హీరోగా యాభై ఏళ్లు పూర్తైనా...తనయుడు మహేష్ బాబు సూపర్ స్టార్ గా ఎదిగినా...ఇంకా నటించడానికి రెడీ అంటున్నారు సూపర్ స్టార్ క్రిష్ణ.

శ్రీ సుశీల విడుదల చేసిన బొమ్మల రామారం పాటలు

అందరు నూతన నటీనటులను పరిచయం చేస్తూ నిషాంత్ దర్శకత్వంలో పుధారి అరుణ నిర్మిస్తోన్న చిత్రం 'బొమ్మల రామారం'.

ఖుష్బు చేత‌ల మీదుగా 'క‌ళావ‌తి' ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌

ప్రముఖ దర్శకుడు సుందర్ సి దర్శకత్వంలో తమిళంలో ఆరణ్మనిగా సూప‌ర్‌డూప‌ర్ హిట్ట‌య్యి ఇప్ప‌డు అర‌ణ్మ‌యి 2 గా ఇప్ప‌టికే త‌మిళ‌నాట సంచ‌ల‌నాన్ని క్రియెట్ చేస్తున్న చిత్రానికి తెలుగులో క‌ళావ‌తి అనే టైటిల్ ని ఖ‌రారు చేసిన విష‌యం తెలిసిందే.

'నేను శైలజ' ను డౌన్ లోడ్ చేస్తే 2 లక్షలు జరిమానా

కొత్త ఏడాది 'నేను శైలజ' విజయంతో శుభంగా ఆరంభమైంది. ఇక్కడ మాత్రమే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లు రాబడుతూ విజయపథంలో దూసుకెళుతోంది.

నాన్న‌కు ప్రేమ‌తో..రిలీజ్ కి అడ్డుపడుతున్న ప‌వ‌న్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన తాజా చిత్రం నాన్న‌కు ప్రేమ‌తో...సుకుమార్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా ఈనెల 13న రిలీజ్ చేస్తున్నారు.