రాజు గారి గది మూవీ రివ్యూ
Send us your feedback to audioarticles@vaarta.com
చిన్న టీవీ యాంకర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి అంకితం, మాయాద్వీపం వంటి షోస్ చేసిన యాంకర్ ఓంకార్ ఆట డ్యాన్స్ షోతో తెలుగు ప్రజలకు చాలా చేరువయ్యారు. టీవీ రంగం నుండి వెండితెర దర్శకుడుగా పరిచయమై డైరెక్ట్ చేసిన జీనియస్` ప్లాపయ్యింది. అయితే దర్శకుడుగా తనని తాను ప్రూవ్ చేసుకోవాలనే తపనతో ఓంకార్ చేసిన రెండో ప్రయత్నమే రాజుగారి గది`. ఆసక్తికరమైన విషయమేమంటే ఈచిత్రంతో తన తమ్ముడు అశ్విన్ ను వెండితెరకు లీడ్ గా పరిచయం చేశాడు. చిన్న సినిమాగా ప్రారంభమైన ఈ సినిమా అసలు రాజుగారి గది అంటే ఏంటని చాలా మంది నటీనటులతో ఓంకార్ డిఫరెంట్ గా ప్లాన్ చేసిన ప్రమోషన్స్ తో రాజుగారి గది` ట్రైలర్ చూసిన చాలా మంది బాగుందని అనుకోవడంతో వారాహి చలనచిత్రం, ఎ.కె.ఎంటర్ టైన్ మెంట్స్ సినిమా రిలీజ్ లో భాగమయ్యారు. దీంతో సినిమా రేంజ్ పెరిగింది. ఇంత మంది అటెన్షన్ పెంచిన రాజుగారి గది` ఎలా ఉంది? అందరి ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ అయ్యిందా అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
కథ...
సినిమా నందిగామ గ్రామంలోని రాజుగారి మహల్ కాన్సెప్ట్ తో ప్రారంభమవుతుంది. ఓ షార్ట్ ఫిలిం చేయాలనే ఆలోచనతో ముగ్గురు యంగస్టర్స్ ఓ రాత్రి పూట మహల్ కు చేరుకుంటారు. విచిత్ర పరిస్థితుల్లో ముగ్గురు చనిపోవడంతో ఆ మహల్ పట్ల గ్రామస్థులకు అప్పటి వరకు ఉన్న భయం పెరుగుతుంది. పోలీసులు కూడా ఓ రకంగా మహల్ లో దెయ్యముందనే నమ్ముతారు. అలాంటి పరిస్థితుల్లో మా టీవీ వారు దెయ్యంతో ఏడు రోజులు..పట్టుకుంటే మూడు కోట్లు అనే రియాల్టీ షో ప్లాన్ చేస్తారు. చాలా మంది డబ్బుకోసం ఆడిషన్ కు వస్తారు. అందులో అశ్విన్(అశ్విన్ బాబు), డా.నందన్(చేతన్), బాలత్రిపుర సుందరి(ధన్య బాలకృష్ణన్), ఈశాన్య(బార్బీ), శివుడు(ధనరాజ్), బుజ్జమ్మ(విద్యుల్లేఖ రామన్), షకలక శంకర్ లు సెలక్ట్ అవుతారు. ఇందులో సినిమా స్టార్టింగ్ లో చనిపోయిన ముగ్గురు తన స్నేహితులు కాబట్టే తను ఈ షో కోసం వచ్చానని డా.నందన్ చెబుతాడు. కొన్ని కండీషన్స్ తో అందరూ ఏడు రోజులు మహల్ కు చేరుకుంటారు. అక్కడ మొదటి రోజు సరదాగా గడిచిపోయినప్పటికీ రెండవ రోజు నుండి దెయ్యం బుజ్జమ్మ, శివుడు, బార్బీ, బాల త్రిపుర సుందరి, షకలక శంకర్ లకు కనపడుతుంది. దాంతో అందరికీ దెయ్యం అంటే భయమెర్పడుతుంది. కానీ నందన్ దెయ్యం లేదంటే, అశ్విన్ దెయ్యుందని తాను ప్రూవ్ చేస్తానని అంటాడు. అందరూ మహల్ ను వెతగ్గా వారికి ఆ మహల్ లో బొమ్మాళ రాజు(పోసాని) ఆత్మ రాసుకున్న ఆత్మకథ దొరుకుతుంది. అందులో బొమ్మాళరాజుకు బొమ్మాళి(పూర్ణ) అనే కూతురుందని, ఆమె తనకు నచ్చినవాడితో పెళ్ళి కానందును చనిపోయిందని ఇప్పుడు ఇద్దరం ఆత్మలుగా తిరుగుతున్నామని ఉంటుంది. అక్కడ నుండే అసలు కథ ప్రారంభం అవుతుంది. రియాల్టీ షో స్టార్టయిన నాలుగో రోజు శివుడు ధరించిన బట్టలు రక్తంతో తడిసి మహల్ లో కనపడుతుంది. దాంతో శివుడుని దెయ్యం చంపేసిందని అనుకుంటారు. అశ్విన్, బాల త్రిపుర సుందరి దెయ్యాన్ని వెతుకుతుండగా వారిపై ఎవరో దుండగులు ఎటాక్ చేస్తారు? అసలు వాళ్ళెవరు? అసలు మహల్ లో దెయ్యముందా? అశ్విన్ ఎవరు? అతనికి మహల్ కు సంబంధం ఏంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్
ఈ సినిమా కథ, కథనం చాలా బావుంది. అవయవదానం అనే కాన్సెప్ట్ పై దర్శకుడు ఓంకార్ సినిమాను చక్కగా డైరెక్ట్ చేశాడు. హర్రర్ కు కామెడిని జత చేసి ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం సక్సెస్ అయ్యింది. బొమ్మాళిగా పూర్ణ, అశ్విన్, చేతన్ ల నటన బావుంది. ఇక కామెడి విషయానికి వస్తే షకలక శంకర్, ధనరాజ్, విద్యుల్లేఖ పోటీ పడి కామెడి పండించే ప్రయత్నం చేశారు. ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు కూడా. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సాయి కార్తీక్ మ్యూజిక్ గురించే. సందర్భానుసారం వచ్చే రెండు పాటలు బాగానే ఉన్నాయి. రీరికార్డింగ్ మాత్రం ఎక్స్ ట్రార్డినరీ. గ్రాఫిక్స్, ఎస్.జ్ఞానమ్ సినిమాటోగ్రఫీ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్ళాయనే చెప్పాలి. నటన పరంగా అందరూ తమదైన పాత్రలకు న్యాయం చేశారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ కథకు తగిన విధంగా ఉంది. నిర్మాణ విలువలు చాలా బావున్నాయి.
మైనస్ పాయింట్స్
అందరూ ఒకచోటకు వెళ్ళడం, అక్కడ దెయ్యం కనపడటం వంటి పాయింట్ సినిమా ఎంచుకున్న పాయింట్ పాతదే అయినా నడిపిన తీరు బావుండటం వల్ల మైనస్ పెద్దగా కనపడదు. ఫస్టాఫ్ లో కామెడీతో సాగిన సినిమా సెకండాఫ్ లో కాస్త డల్ గా సాగినట్టు అనిపిస్తుంది. కాస్త ల్యాగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఫస్టాఫ్ కామెడి ఉండటం, సెకండాఫ్ కామెడి పర్సేంటేజ్ తగ్గడం వల్ల సెకండాఫ్ సీరియస్ గా అనిపిస్తుంది. ఎడిటింగ్ చాలా బావుంది. క్లయిమాక్స్ లో చేతన్ అశ్విన్ ను డామినేట్ చేసేశాడు. తొలి సగం ఫాస్ట్ గా ఉండటం వల్లనే సెకండాఫ్ అలా ఉంటుంది. అంతేకానీ కథాపరంగా ఎక్కడా ఇబ్బంది కలగదు. అందువల్ల మైనస్ పాయింట్లుగా చెప్పదగినవి పెద్దగా ఏమీ లేవు.
విశ్లేషణ
ఓంకార్ ఈ సినిమాను డైరెక్షన్ చేసిన స్టయిల్, నిర్మాతగా రూపొందిన తీరు నిజంగా అభినందనీయం. చిన్న బడ్జెట్ లోనే మంచి క్వాలిటీ మూవీని తెరకెక్కించాడు. పూర్ణ, పోసాని, రఘుబాబు, ప్రభాస్ శ్రీను వంటి ప్యాండింగ్ ఆర్టిస్టులతో పాటు, అశ్విన్, చేతన్ వంటి యంగ్ హీరోస్ ను చక్కగా హ్యండిల్ చేశారు. గీతాంజలి తర్వాత షకలక శంకర్ కామెడి బావుందనే టాక్ గ్యారంటీగా వస్తుంది. ధనరాజ్ కామెడి కూడా సూపర్. వీరితో విద్యుల్లేఖ పోటీ పడింది. ముగ్గురి కామెడి ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పిస్తుందనడంలో సందేహం లేదు. మంచి కథ, కథనానికి సాయికార్తీక్ మ్యూజిక్, రీరికార్డింగ్ , ఎస్.జ్ఞానమ్ సినిమాటోగ్రఫీ, నాగరాజ్ ఆర్ట్ డైరెక్షన్ సినిమా రేంజ్ ను మార్చేశాయి. సినిమాలో ఆడియెన్స్ ను ఆకట్టుకునేలా ఓంకార్ మెగా ఫ్యామిలీ హీరో స్ అయిన చిరు, పవన్ పేర్లను వాడుకున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే దర్శకుడిగా, నిర్మాతగా ఓంకార్ చేసిన ప్రయత్నం చాలా బావుంది.
బాటమ్ లైన్
హర్రర్ మూవీస్ అంటే ఏదో భయపెట్టాలనే ఆలోచనలతో కాకుండా నవ్విస్తూ భయపెడతూ దానికి చిన్న మెసేజ్ ను కూడా జోడిస్తే ప్రేక్షకులకు నచ్చుతుందనే విధంగా రాజుగారి గది సినిమా ఉంది. మొత్తం మీద రాజుగారి గది` హిలేరియస్ కామెడి ఎంటర్ టైనర్
రేటింగ్: 3/5
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com