రాజుగారి గది సక్సెస్ మీట్
Send us your feedback to audioarticles@vaarta.com
ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా రాజుగారి గది. చేతన్ చీను, పూర్ణ, అశ్విన్ బాబు, శకలక శంకర్, విద్యుల్లేఖ రామన్, ధన్య బాలకృష్ణన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సాయి కొర్రపాటి, అనిల్ సుంకర విడుదల చేశారు. ఓక్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రూపొందింది. దసరాకు విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఈ సినిమా యూనిట్ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు.
ఓంకార్ మాట్లాడుతూ ``అవదానం గురించి హారర్ ఎలిమెంట్స్ తో తీసిన సినిమా ఇది. సాయి కొర్రపాటి గారు, అనిల్ సుంకరగారు, నిమ్మగడ్డ ప్రసాద్‌గారిని మర్చిపోలేను. 42 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశాం. రెండో వారానికి థియేటర్ల సంఖ్యను పెంచుతున్నాం`` అని తెలిపారు.
పూర్ణ మాట్లాడుతూ ``నా రెండో హారర్ ఫిల్మ్ ఇది. ఇందులో నా గెటప్‌కు చాలా మంచి స్పందన వస్తోంది`` అని చెప్పారు. అశ్విన్ మాట్లాడుతూ ``ఈ సినిమా హిట్‌తో నాకు మంచి లైఫ్ వచ్చింది`` అని అన్నారు. చక్కటి గుర్తింపు వచ్చినందుకు ఆనందంగా ఉందని చేతన్ అన్నారు. చిన్న సినిమాగా మొదలై పెద్ద స్థాయికి చేరిన సినిమా ఇది అని సాయికార్తిక్ అన్నారు. సంభాషణలను అందరూ ఆస్వాదిస్తున్నారని సాయిమాధవ్ బుర్రా చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments