రాజుగారు ఎప్పుడొస్తున్నారంటే..
Send us your feedback to audioarticles@vaarta.com
ఓం నమో వేంకటేశాయ` సినిమా తర్వాత అక్కినేని నాగార్జున హర్రర్ థ్రిల్లర్ `రాజుగారి గది 2` సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. మనుషుల మైండ్స్‌తో ఆటలాడే వ్యక్తి పాత్రలో నాగార్జున కనపడబోతున్నాడు. నాగార్జున లుక్ కూడా విడుదలై మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకుంది ఓంకార్ దర్శకత్వంలో పివిపి సినిమా, ఓక్ ఎంటర్టైన్మెంట్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై సినిమా రూపొందుతోంది.
ఈ సినిమాలో నాగార్జునతో పాటు శీరత్ కపూర్, సమంత కీలక పాత్రల్లో కనిపించనున్నారు.శీరత్ డ్యాన్సర్ పాత్రలో కనపడుతుంటే, సమంత ఆత్మ పాత్రలో కనపడనుందట. ఇప్పుటి సమాచారం ప్రకారం సినిమాను అక్టోబర్ 12 లేదా 19న విడుదల చేయాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట. ఈ సినిమా తర్వాత నాగార్జున ఓ కొత్త దర్శకుడితో కలిసి పనిచేయబోతున్నాడని ఇండస్ట్రీలో టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments