రాజుగారు ఎప్పుడొస్తున్నారంటే..

  • IndiaGlitz, [Saturday,July 22 2017]

ఓం న‌మో వేంక‌టేశాయ' సినిమా త‌ర్వాత అక్కినేని నాగార్జున హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ 'రాజుగారి గ‌ది 2' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. మ‌నుషుల మైండ్స్‌తో ఆట‌లాడే వ్య‌క్తి పాత్ర‌లో నాగార్జున క‌న‌ప‌డ‌బోతున్నాడు. నాగార్జున లుక్ కూడా విడుద‌లై మంచి రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంది ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో పివిపి సినిమా, ఓక్ ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్స్‌పై సినిమా రూపొందుతోంది.

ఈ సినిమాలో నాగార్జున‌తో పాటు శీర‌త్ కపూర్, స‌మంత కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.శీర‌త్ డ్యాన్స‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డుతుంటే, స‌మంత ఆత్మ పాత్రలో క‌న‌ప‌డ‌నుంద‌ట‌. ఇప్పుటి స‌మాచారం ప్ర‌కారం సినిమాను అక్టోబ‌ర్ 12 లేదా 19న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. ఈ సినిమా త‌ర్వాత నాగార్జున ఓ కొత్త ద‌ర్శ‌కుడితో క‌లిసి ప‌నిచేయ‌బోతున్నాడ‌ని ఇండ‌స్ట్రీలో టాక్‌.