పాక్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రాజ్‌నాథ్
Send us your feedback to audioarticles@vaarta.com
పాకిస్థాన్‌కు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అస్తమానూ దాయాదీ దేశమైన పాక్ కాలుదువ్వడం.. మీడియా ముందుకు వచ్చి ఇష్టానుసారం మాట్లాడుతుండటం, మరీ ముఖ్యంగా పాక్ మంత్రి ఏకంగా యుద్ధానికి సిద్ధం అని మాట్లాడటంతో ఈ మొత్తం వ్యవహారంపై రాజ్‌నాథ్ ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ముఖ్యంగా జమ్ము కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ తీరును ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. కశ్మీర్ వ్యవహారంలో నిరాధార వ్యాఖ్యలు చేయరాదని హెచ్చరించారు.
కశ్మీర్ పాకిస్తాన్‌తో ఎప్పుడు ఉంది!?
"కశ్మీర్‌లోయ భారత్ అంతర్భాగమని పునరుద్ఘాటిస్తూ ఈ ప్రాంతంపై పాక్ ప్రమేయం ఉండబోదు. దీనిపై భ్రమల్లో ఉండరాదు. గిల్గిత్-బల్టిస్తాన్‌ను పీఓకేతో పాటు పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకుంది. కశ్మీర్ లోయ మొత్తం భారత్‌లో భాగమని 1994లో భారత పార్లమెంట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. దీనిపై తమ వైఖరి సుస్పష్టమైనది. భారత్ నుంచి విడిపోయి పాకిస్తాన్ ఏర్పాటైంది.. అసలు కశ్మీర్ పాకిస్తాన్‌తో ఎప్పుడు ఉంది..? పాకిస్తాన్ ఉనికిని తాము గౌరవిస్తామని, అలాగని కశ్మీర్‌పై పాక్ ఇష్టానుసారం మాట్లాడటం సరైంది కాదు" అని ట్విట్టర్ వేదికగా రాజ్‌నాథ్ చెప్పుకొచ్చారు. అయితే రాజ్ నాథ్ వ్యాఖ్యలపై పాక్ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout