2 డీజీ డ్రగ్‌ను నేడు విడుదల చేయనున్న రాజ్‌నాథ్
- IndiaGlitz, [Monday,May 17 2021]
కరోనాపై పోరుకు డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన కొవిడ్-19 ఔషధం 2-డియాక్సీ డి-గ్లూకోజ్(2డీజీ) నేడు అందుబాటులోకి రానుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో నేడు ఈ 2 డీజీ డ్రగ్‌ను విడుదల చేయనున్నారు. తొలి విడతలో భాగంగా మొత్తం 10 వేల డోసులు పంపిణీ చేయనున్నారు. పొడి రూపంలో రానున్న ఈ ఔషధాన్ని నీటితో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల.. వైరస్ ఉన్న కణాల్లోకి చేరి, దాని వృద్ధిని అడ్డుకుంటుందని డీఆర్‌డీఓ వివరించింది.
కరోనాకు ఇప్పటి వరకు వ్యాక్సిన్లను మాత్రమే ఇస్తున్న సంగతి తెలిసిందే. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ నోటి ద్వారా తీసుకునే ఔషధాన్ని తయారు చేసింది. 2-డీజీ డ్రగ్‌ను నేడు కేంద్రమంత్రి హర్షవర్థన్‌తో కలిసి రాజ్‌నాథ్‌సింగ్ విడుదల చేయనున్నారు. కొవిడ్ చికిత్సలో కొత్త మందు విడుదలైంది. నీటిలో కలుపుకొని తాగేలా పౌడర్ రూపంలో 2డీజీ ఔషధాన్ని తయారు చేశారు. డాక్టర్ రెడ్డీస్‌తో కలిసి డీఆర్డీవో 2డీజీ ఔషధాన్ని తయారు చేసింది. తొలివిడతలో అందుబాటులోకి పదివేల పొట్లాలు వచ్చాయి. జూన్‌లో పెద్ద మొత్తంలో మార్కెట్లోకి 2 డీజీ డ్రగ్ రానుంది.
2-డీజీ ఔషధం పౌడర్ రూపంలో లభిస్తుంది. దీనిని నీటిలో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఔషధం వైరస్ సోకిన కణాల్లోకి చేరి వైరస్ వృద్ధి చెందకుండా అడ్డుకుంటుంది. సాధారణంగా కరోనా వైరస్ ఒక కణంలోకి చేరాక ఆర్‌ఎన్‌ఏను వృద్ధి చేయడం ద్వారా కొత్త వైరస్ కణాలను తయారుచేస్తుంది. అవి ఇతర కణాలకు విస్తరించి వ్యాధి తీవ్రతను పెంచుతాయి. 2-డీజీ ఈ ప్రక్రియను నిలువరిస్తుంది. ఆర్‌ఎన్‌ఏను వృద్ధి చేసేందుకు కావాల్సిన శక్తి (గ్లూకోజ్) వైరస్‌కు అందకుండా అడ్డుకుంటుంది. ఫలితంగా వైరస్ వృద్ధి నిలిచిపోయి రోగి వేగంగా కోలుకుంటారు.