మరోసారి మూడేళ్ళ గ్యాప్‌తో రాజమౌళి
- IndiaGlitz, [Sunday,June 10 2018]
ఏడాదికో సినిమా.. లేదంటే రెండేళ్ళకో సినిమా.. అన్నట్లుగా కెరీర్ ఆరంభంలో తన సినిమాలతో పలకరించేవారు దర్శకమౌళి రాజమౌళి. 2003 నుంచి 2007 వరకు ప్రతీ ఏడాది తన సినిమాలతో పలకరించిన రాజమౌళికి .. యమదొంగకు మగధీరకు మధ్య రెండేళ్ళ గ్యాప్ వచ్చింది. అయితే ఏడాదిలోపే మర్యాద రామన్నతో పలకరించారు. ఆ తరువాత మాత్రం సినిమా సినిమాకి రెండేళ్లు లేదా మూడేళ్ళ గ్యాప్ తీసుకుంటున్నారు.
మర్యాద రామన్న తరువాత ఈగకు రెండేళ్ళ గ్యాప్ వస్తే.. ఈగకు, బాహుబలికి మధ్య మూడేళ్ళ గ్యాప్ ఉంది. అలాగే బాహుబలికి, బాహుబలి 2కి రెండేళ్ళ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో చేస్తున్న మల్టీస్టారర్ మూవీ 2020కి రానుంది. అంటే.. 2017లో బాహుబలి 2 వస్తే.. మూడేళ్ళ గ్యాప్ తరువాత మల్టీస్టారర్ మూవీ రానుందన్నమాట.
ఈగ తరువాత మూడేళ్ళ గ్యాప్‌తో పలకరించి.. బాహుబలి రూపంలో బ్లాక్‌బస్టర్ హిట్ సొంతం చేసుకున్న రాజమౌళి.. బాహుబలి 2 తరువాత మళ్ళీ మూడేళ్ళ గ్యాప్‌తో వస్తున్న మల్టీస్టారర్ మూవీతోనూ దాన్ని రిపీట్ చేస్తారేమో చూడాలి.