రూమర్స్‌కు క్లారిటీ ఇచ్చిన రాజీవ్, సుమ కనకాల
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ టాప్ యాంకర్ ఎవరనగానే మనకు గుర్తుకొచ్చే పేరు సుమ కనకాల. స్టార్ హీరోల ఆడియో ఫంక్షన్ష్, ప్రీ రిలీజ్ వేడుకలకు సుమ కనకాలే యాంకరింగ్ చేస్తుంటారు. ఈమె భర్త..రాజీవ్ కనకాల. నటుడిగా రాజీవ్ కనకాల గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. వీరికి ఓ అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. ఈ మధ్య కాలంలో వీరి మధ్య గొడవ జరిగిందని, ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలకు బలం చేకూర్చేలా అటు సుమ, ఇటు రాజీవ్ ఎవరూ ఈ వార్తలపై స్పందించలేదు. దీంతో అందరూ రాజీవ్, సుమ కనకాల విడిపోయారనే అనుకున్నారు. అయితే అలాంటిదేమీ లేదని, ఇద్దరి మధ్య ఏదో చిన్న చిన్న వివాదాలుండి సమసిపోయాయని రీసెంట్గా జరిగిన ఓ ప్రోగ్రామ్‌లో అందరికీ క్లారిటీ వచ్చేసింది.
ఈ ప్రోగ్రామ్‌లో రాజీవ్, రాజా రవీందర్, బ్రహ్మాజీ, సమీర్ పాల్గొన్నారు. ఇందులో రాజీవ్, సుమ బాగా ఎమోషనల్ అయ్యారు. రాజీవ్ సుమను ఎత్తుకుని తిప్పడం చివరగా సుమ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంటే రాజీవ్ ఆమె ఓదార్చడం జరిగింది. ఇవన్నీ చూసిన వారికి రాజీవ్, సుమ మధ్య ఏదో చిన్న చిన్న సమస్యలున్నాయని.. అయితే రూమర్స్‌లో వచ్చినంత ఏమీ లేదని అందరికీ అర్థమైంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com