రజనీ `దర్బార్` షూటింగ్ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా స్టార్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ చిత్రం నిర్మించిన చిత్రం `దర్బార్`. క్రేజీ కాంబినేషన్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రమిది. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరగనున్నాయి. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుంటే.. నివేదా థామస్ కీలక పాత్రధారిగా నటిస్తుంది.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి విలన్‌గా కనిపించబోతన్నాడు. ఇంతకు ముందు కాలాలో నానా పటేకర్ .. పేట చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ వంటి బాలీవుడ్ నటులు రజనీకాంత్‌కి ప్రతి నాయకులుగా నటించారు. ఇప్పుడు మరో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి విలన్‌గా వెండితెరపై సందడి చేయబోతున్నాడు.
ఇప్పటికే మలయాళ నటుడు చెంబన్ వినోద్ జోష్‌తో పాటు బాలీవుడ్ నటులు ప్రతీక్ బబ్బర్, దలీప్ తాహిల్ కూడా ఇందులో నటిస్తున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. అనిరుధ్ సంగీతం.. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com