రజనీ మాటల రచయితే కమల్ కి కూడా..
Send us your feedback to audioarticles@vaarta.com
లోక నాయకుడు కమల్ హాసన్, సూపర్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన భారతీయుడు` ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సీక్వెల్‌ని 2.O` నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. కోలీవుడ్ సమాచారం ప్రకారం.. భారతీయుడు 2` తమిళ వెర్షన్‌కి మాటలు రాసే పనిని జయమోహన్‌కి అప్పగించారట శంకర్. ప్రస్తుతం ఈ మాటల రచయిత 2.O`కి మాటలను అందిస్తున్నారు.
జయమోహన్ రచనాశైలి నచ్చి శంకర్ ఈ బాధ్యతని అప్పగించారని తమిళ్ ఇండస్ట్రీ చెబుతోంది. తాజాగా ప్రీ-ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టిన భారతీయుడు 2` టీంతో.. శంకర్ తన అప్ కమింగ్ మూవీ 2.O` పనులన్నింటిని ముగించిన తర్వాత వచ్చి చేరుతారని సమాచారం. ఇదిలా వుంటే...రజనీకాంత్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 2.O` ఏప్రిల్ 14న తమిళ్ న్యూ ఇయర్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments