అదే డైరెక్టర్ తో మరోసారి రజనీకాంత్....

  • IndiaGlitz, [Tuesday,August 30 2016]

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ రీసెంట్ మూవీ 'క‌బాలి'. క‌లెక్ష‌న్స్ పరంగా సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. పా రంజిత్ త‌న ద‌ర్శ‌క‌త్వంలో డాన్ క్యారెక్ట‌ర్‌లో ర‌జ‌నీకాంత్‌ను స‌రికొత్త‌గా ప్రెజంట్ చేశాడు. అయితే ర‌జ‌నీకాంత్ మాస్ ఇమేజ్‌ను సరిగ్గా రంజిత్ చూపించ‌లేక పోయాడ‌ని ఫ్యాన్స్ బాధ‌ప‌డ్డారు, ద‌ర్శ‌కుడిని విమ‌ర్శించారు కూడా. అయితే బాక్సాఫీస్ పరంగా సినిమా మంచి ప‌లితాల‌నే రాబ‌ట్టుకుంది. కానీ పా రంజిత్ టేకింగ్ న‌చ్చ‌డంతో ర‌జ‌నీకాంత్ ఇప్పుడు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న 2.0 సినిమా త‌ర్వాత రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని ర‌జ‌నీకాంత్ అల్లుడు హీరో ధ‌నుష్ క‌న్‌ఫ‌ర్మ్ చేశాడు. ఈ చిత్రాన్ని వుండెర్‌బార్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై ధ‌నుష్ నిర్మించ‌నుండ‌టం విశేషం.