హిట్ ఇచ్చిన డైరెక్టర్‌తో రజనీకాంత్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇప్పుడు ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో 'దర్బార్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రజనీకాంత్ తనకు హిట్ ఇచ్చిన యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడని కోలీవుడ్ వర్గాల సమాచారం.
ఈ ఏడాది రజనీకాంత్‌కు 'పేట్ట' చిత్రంతో కార్తీక్ సుబ్బరాజ్ సూపర్‌డూపర్ హిట్‌ను అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి రజనీకాంత్ కార్తీక్ సుబ్బరాజ్‌తో వర్క్ చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని వండర్ బార్స్ బ్యానర్‌పై ధనుష్ నిర్మించబోతున్నాడు.
వచ్చే ఏడాదిలో ఈ సినిమా సెట్స్‌కు వెళుతుంది. ఈలోపు కార్తీక్ సుబ్బరాజ్ రజనీకాంత్ రెండో అల్లుడు విశాఖన్‌తో ఓ సినిమా చేస్తాడు. ఈ సినిమా పూర్తయ్యే లోపు రజనీకాంత్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేసేలా ప్లాన్స్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com